ట్రాక్టర్‌ ఢీకొని యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ ఢీకొని యువకుడు మృతి

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

లావేరు : కొత్తకోట నుంచి అదపాక వెళ్లే రోడ్డులో ద్విచక్ర వాహనాన్ని ట్రాక్టర్‌ ఢీకొన్న ఘటనలో పిల్లా ధీరజ్‌ (23) అనే యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తకోటకు చెందిన పిల్లా ధీరజ్‌, సోదరుడు కిరణ్‌కుమార్‌, రొక్కం సుమంత్‌ డిగ్రీ పూర్తిచేశారు. ఉద్యోగ సాధనలో భాగంగా శ్రీకాకుళంలో ఓ కోచింగ్‌ సెంటర్‌లో కోచింగ్‌ పొందుతున్నారు. ప్రతి రోజూ కొత్తకోట నుంచి అదపాక జంక్షన్‌ వరకూ బైక్‌పై వచ్చి అక్కడి నుంచి బస్సుకువెళ్లేవారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం కొత్తకోట నుంచి అదపాక వైపు వెళ్తుండగా మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో వెనుక కూర్చున్న ధీరజ్‌కు తీవ్రగాయాలు కావడంతో 108 అంబులెన్సులో రిమ్స్‌కు తరలించగా అక్కడ మృతిచెందాడు. గాయపడిన మరో ఇద్దరు యువకులు రిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. లావేరు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement