● పరిషత్‌ ఎన్నికలకు 21 నుంచి నామినేషన్ల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

● పరిషత్‌ ఎన్నికలకు 21 నుంచి నామినేషన్ల స్వీకరణ

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు ఎన్నికల మాన్యువల్‌ను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని, నిర్దేశిత గడువులోనే పనులన్నీ పూర్తి చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 21వ తేదీ నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుందని, నవంబర్‌ 3న ఎన్నికలు, 5న ఓట్ల లెక్కింపు నిర్వహిస్తామని వెల్లడించారు. ఎన్నికలు పారదర్శకంగా, ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు ప్రత్యేక నోడల్‌ అధికారులను నియమించామని, డివిజన్‌ స్థాయిలో ఆర్డీఓలు ఇన్‌చార్జులుగా, ఎంపీడీఓలు అసిస్టెంట్‌ అథారిటీలుగా వ్యవహరిస్తారని తెలిపారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వరరావు, జిల్లా పరిషత్‌ సీఈఓ వెంకట్రామన్‌, సీపీఓ లక్ష్మీ ప్రసన్న, ఇతర జిల్లా స్థాయి నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement