మన ధ్యేయం సురక్షిత పలాస | - | Sakshi
Sakshi News home page

మన ధ్యేయం సురక్షిత పలాస

Oct 17 2026 12:40 AM | Updated on Oct 17 2026 12:40 AM

● సరైన తీర్పునిచ్చేందుకు ప్రజలు వేచిచూస్తున్నారు

● పుర పోరుకు అభ్యర్థుల ప్రకటన సమావేశంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు

కాశీబుగ్గ: ‘పలాసలో అరాచకం రాజ్యమేలుతోంది. భూ కబ్జాలు, దందాలు, మద్యం సీసాపై అదనపు ధరలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. వీటిపై ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఎన్నికలు ఎప్పుడొస్తాయా? అని ఎదురు చూస్తున్నారు. ఆ సమయం రానే వచ్చింది. అందుకు ఈ ఎన్నికలలో అభ్యర్థులు ఆత్మ విశ్వాసంతో నిలబడి ప్రత్యర్థులతో రాజకీయంగా తలబడి విజయం సాధించాలి’ అని మాజీ మంత్రి, పలాస నియోజకవర్గ సమన్వయకర్త సీదిరి అప్పలరాజు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. శుక్రవారం పలాస మునిసిపాలిటీ బరిలో పార్టీ తరఫున నిలిచే అభ్యర్థుల జాబితాను సీదిరి ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరి కార్యకర్తల అభిప్రాయం మేరకే అభ్యర్థుల ఎంపిక జరిగిందన్నారు. సురక్షిత పలాస ధ్యేయంగా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. తాళాసు శ్రీ పద్మ విద్యావంతురాలే కాకుండా సామాజిక సేవలో ఆమె ఎనలేని కృషి చేస్తున్నారన్నారు. ఈ ప్రాతిపదికనే ఆమెకు పార్టీ తరపున చైర్‌ పర్సన్‌ అభ్యర్థినిగా అధిష్ఠానం ఎంపిక చేసిందన్నారు. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లవుతోందని, సీసీరోడ్లకు శంకుస్థాపనలు చేసి అభివృద్ధి అని డప్పుకొడుతున్నారని సీదిరి విమర్శించారు. అభివృద్ధి అంటే కిడ్నీ ఆసుపత్రి, పలాసకు డిగ్రీ కాలేజీ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులోకి తీసుకురావడమన్నారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థి శ్రీపద్మ మా ట్లాడుతూ తాను చైర్‌పర్సన్‌ అయితే ప్రతి కౌన్సిలర్‌ చైర్‌ పర్సన్‌ అయినట్లేనని, అందరికీ సమాన గౌరవం పొందేలా కృషి చేస్తానని చెప్పారు. మాజీ ఏఎంసీ చైర్మన్‌ పీవీ సతీశ్‌ మాట్లాడుతూ కళింగ వైశ్య సామాజికవర్గానికి పార్టీ అధిష్ఠానం గుర్తింపునివ్వడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు సుజాత పండాయాదవ్‌, పార్టీ పట్టణ అధ్యక్షులు శిష్టు గోపీ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

టీమ్‌

పలాస

నేడు వైఎస్సార్‌ సీపీ కౌన్సిల్‌ అభ్యర్థుల నామినేషన్‌

కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ పురపాలక ఎన్నికలలో భాగంగా వైఎస్సార్‌సీపీ కౌన్సిల్‌ అభ్యర్థులు శనివారం నామినేషన్‌ వేయనున్నారు. చైర్‌పర్సన్‌ అభ్యర్థినితోపాటు 36 వార్డుల్లో పోటీ చేసేవారంతా ఒకేరోజు నామినేషన్‌ వేసేందుకు నిర్ణయించారు. ఈ మేరకు శనివారం మాజీమంత్రి సీదిరి అప్పలరాజు స్వగృహం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి, మున్సిపాలిటీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడ నామినేషన్‌ వేసి మీడియాతో మాట్లాడతారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement