చవితి వేడుకలు పరిపూర్ణంగా ముగియడంతో గణపతి విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరుకున్నాయి. శనివారం రాత్రి వినాయక నిమజ్జనాలు ఉత్సాహంగా జరిగాయి. ఆటపాటలతో భక్తులు స్వామిని ఊరేగించి అనుపు ఉత్సవం నిర్వహించారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం
శాలిహుండంలోని బౌద్ధ స్థూపాలు
నిమజ్జనానికి తరలివెళ్తున్న గణపయ్య
శ్రీకాకుళం అర్బన్: ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంక్‌లు ఆదివారం పనిచేయనున్నాయి. ఈ నెల 28, 29, 30 తేదీల్లో బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా జిల్లాలోని దాదాపు అన్ని బ్యాంకు శాఖలు మూసిసే అవకాశం ఉంది. ఈ మూడు రోజుల్లో ప్రజలకు బ్యాంకింగ్ సేవలకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఇండియన్ బ్యాంక్ అసోసియేషన్స్), రిజర్వ్ బ్యాంక్ అనుమతులతో ఆదివారం అన్ని బ్యాంకులు సాధారణ పని దినం మాదిరిగా పనిచేయనున్నాయి. అత్యవసరమైన బ్యాంకింగ్ అవసరాలు ఉన్న ప్రజలు ఆదివారం ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీకాకుళం జిల్లా లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ పి.శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు.


