పక్షి పిల్లల సంరక్షణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

పక్షి పిల్లల సంరక్షణకు చర్యలు

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

పక్షి పిల్లల సంరక్షణకు చర్యలు

ఇచ్ఛాపురం రూరల్‌: భారీ వర్షాలు, ఈదురుగాలులకు తేలుకుంచి గ్రామంలోని చెట్లపై గూళ్లో ఉండాల్సిన విదేశీ పక్షి పిల్లలు నేలపై పడి గాయపడటం, మరణించడం జరుగుతుందంటూ శనివారం ‘సాక్షి’లో ‘ఆపదలో అతిథులు’ శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం అటవీశాఖ సిబ్బంది గ్రామానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దేందుకు చర్యలు చేపట్టారు. గాయపడిన పక్షి పిల్లలను ప్రత్యేక గదికి తీసుకువెళ్లి చికిత్స అందజేశారు. పక్షి పిల్లలు నేలరాలితే స్థానికంగా ఉంటున్న తమ సిబ్బందికి సమాచారం అందించి, చికిత్సాలయానికి తీసుకువచ్చేందుకు సహాయపడాలని స్థానికులను కోరారు. పక్షులను పరిశీలించిన వారిలో మందస డీఆర్వో టి.దేవరాజు, బీట్‌ అధికారులు భానుమూర్తి, సురేష్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement