తల్లి గర్భంలో ఉన్నప్పుడే చంపేయాలన్నంత వివక్ష ఒకనాడు చూపారు.. కార్యదీక్షతో వివక్షలను దాటుకుని మహాలక్ష్మిగా నవ్వుతూ నిలబడింది. పది దాటి చదివితే గొప్పే అని హేళన చేశారు.. ఉన్నత ఉద్యోగాలను అవలీలగా సాధించి సరస్వతీ మాతకు ప్రతిరూపమై ఎదిగింది. ఆడపిల్ల అంటే గుండెలప | - | Sakshi
Sakshi News home page

తల్లి గర్భంలో ఉన్నప్పుడే చంపేయాలన్నంత వివక్ష ఒకనాడు చూపారు.. కార్యదీక్షతో వివక్షలను దాటుకుని మహాలక్ష్మిగా నవ్వుతూ నిలబడింది. పది దాటి చదివితే గొప్పే అని హేళన చేశారు.. ఉన్నత ఉద్యోగాలను అవలీలగా సాధించి సరస్వతీ మాతకు ప్రతిరూపమై ఎదిగింది. ఆడపిల్ల అంటే గుండెలప

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

●గుండె‘గుడి’లో..

కంటే కూతుర్నే కనాలి..

కాశీబుగ్గ: కడుపులో బిడ్డ అమ్మాయి అని తెలిసి బలవంతంగా అబార్షన్లు చేయించిన ఘట్టాలు అనాదిగా వింటూనే ఉన్నాం. కానీ ఈ తరం అలా లేదు. కంటే కూతుర్నే కనాలని చెబుతోంది. కూతు రు పుడితే భారం అనుకున్న రోజులు దాటి అమ్మాయి పుడితే వరం అనే భావన బలపడుతోంది. ఈవిషయమై వివిధ వర్గాల నుంచి సాక్షి అభిప్రాయాలు సేకరించగా అమ్మాయికే తమ తొలి ప్రాధాన్యమంటూ అభిప్రాయం వెలిబుచ్చారు.

టెక్కలి: లింగాలవలసలో ఓ షిర్డీసాయి మందిరం కనిపిస్తుంది. మందిరంలో ఓ యువతి సాయిని పూ జిస్తున్నట్టుగా విగ్రహం ఉంటుంది. ఇది ఓ తండ్రి తన కూతురిపై పెంచుకున్న ప్రేమకు నిదర్శనం. లింగాలవలస గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ సంపతిరావు రాఘవరావు కుమార్తె రూప 27 ఏళ్ల వయసులో అనారోగ్యంతో మృతి చెందారు. ఆమె షిర్డీసాయి భక్తురాలు కావడంతో కుమార్తెను మర్చిపోలేక ఇలా గుడిలో ఆమె రూపాన్ని ప్రతిష్టించారు. నిత్యం కుమార్తెను స్మరిస్తూ ఆమె జ్ఞాపకాలకు ఊపిరి పోస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement