పిట్ట కొంచెం.. వ్యూస్‌ ఘనం | - | Sakshi
Sakshi News home page

పిట్ట కొంచెం.. వ్యూస్‌ ఘనం

Sep 27 2026 1:46 AM | Updated on Sep 27 2026 1:46 AM

పిట్ట కొంచెం.. వ్యూస్‌ ఘనం

ఇచ్ఛాపురం రూరల్‌: రీల్స్‌.. జెన్‌ జీ, జెన్‌ ఆల్ఫాలను విపరీతంగా ఆకట్టుకుంటున్న సాధనం. తమ ప్రతిభను నిరూపించుకోవడానికి రీల్స్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్టు చేయడం అలవాటు చేసుకుంటున్నారు. ఇచ్ఛాపురం మండలం బిర్లంగి ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న శివానీ కూడా రీల్స్‌తో అదరగొడుతోంది. పైగా తండ్రి ధర్మరాజు శెట్టి దగ్గరుండి కూతురితో ఇలా సందేశాత్మక రీల్స్‌ చేయిస్తుండడం విశేషం. ఇప్పటికి 1131 రీల్స్‌ రూపొందించిన బాలిక.. నిత్యం ఏదో ఒక కొత్త అంశంతో ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా వచ్చిన ‘ఇరుముడి’ చిత్రంలోని ‘కట్టుకట్టు ఇరుముడి’ పాటకు, అలాగే ‘సన్నాఫ్‌ విశ్వనాథం’ సినిమాలోని ‘నేనో బటర్‌ఫ్లై’ పాటలకు మిలియన్ల కొద్దీ వ్యూస్‌ వచ్చాయి. ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరీ’ పాటకు చేసిన నృత్యానికి ఆ చిత్ర దర్శకుడు బుచ్చి బాబు సైతం ముగ్ధుడై అభినందించారు. ఇప్పటి వరకు 200కు పైగా కామెడీ రీల్స్‌ చేసి నెటిజన్లను నవ్విస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement