టెక్కలి: ఇటీవల రైలు ఢీ కొని మృతి చెందిన ఇంటర్ విద్యార్థులకు సంబంధించి బాధిత కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్‌ఎఫ్, ఏఐవైఎఫ్, డీహెచ్‌పీఎస్ సంఘాలు శనివారం టెక్కలి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేశారు. వసతి గృహం అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో ఈ సంఘటన చోటు చేసుకుందని గుర్తు చేశారు. ప్రమాదంలో గాయపడిన సాల్మన్‌రాజుకు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనలో గిరిజన శాఖ డీడీతోపాటు ఐటీడీఏ పీఓపై విచారణ చేపట్టాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఎం.యుగంధర్, ఎల్.వెంకట్రావు, సిహెచ్.రవి, బి.సంతోష్, కె.శ్రీనివాస్, జస్వంత్, లలిత్, వసంతరావు, కిరణ్, వెంకటేష్, లవకుమార్, ఎస్.కృష్ణ, ధర్మారావు తదితరులు పాల్గొన్నారు.


