టెక్కలి: గిరిజన హాస్టల్‌లో చదువుతూ తమ పిల్లలు చనిపోతే ఐటీడీఏ అధికారులు కనీసం పట్టించుకోలేదని, ఇప్పటి వరకు గ్రామాలకు రాలేదని బాధిత కుటుంబ సభ్యులు ఐటీడీఏ పీఓ పవార్ స్వప్నిల్ ఎదుట వాపోయారు. శనివారం ఐటీడీఏ పీఓతో పాటు డీడీ అన్నాదొర తదితరులు టెక్కలి మండలం డమర, చిన్నభీంపురం గ్రామాల్లో బాధిత విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ బి.రాకేష్ మాట్లాడుతూ రైలు ప్రమాదంలో గిరిజన విద్యార్థులు చనిపోతే అంత్యక్రియలకు ఇచ్చే సాయం కూడా అందజేయలేదని పీఓ దృష్టికి తీసుకువెళ్లగా ఆయన డీడీపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం టెక్కలి గిరిజన పోస్టుమెట్రిక్ వసతి గృహాన్ని పీఓ సందర్శించగా విద్యార్థులు సమస్యలను ఏకరువు పెట్టారు.


