రైలు ప్రమాద బాధితుడికి పరామర్శ | - | Sakshi
Sakshi News home page

రైలు ప్రమాద బాధితుడికి పరామర్శ

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

రైలు ప్రమాద బాధితుడికి పరామర్శ

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): టెక్కలి వద్ద బుధవారం జరిగిన రైలు ప్రమాదంలో గాయపడి శ్రీకాకుళం రిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంటర్‌ విద్యార్థి సాల్మన్‌రాజుని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌ శనివారం పరామర్శించారు. తల్లిదండ్రులతో మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ కొంత ఆర్థిక సాయం అందించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులను కోరారు. వారితో పాటు వైఎస్సార్‌సీపీ కాళింగ కుల బీసీ విభాగం అధ్యక్షుడు ఆరంగి మురళీధర్‌, కూరాకుల, పొందరకుల బీసీ విభాగం అధ్యక్షుడు రాజాపు అప్పన్న, పంచాయతీరాజ్‌ ఉపాధ్యక్షులు నడుపూరు శ్రీరామ్మూర్తి, నూక సత్యరాజు, రాష్ట్ర ఐటీ విభాగం కార్యదర్శి కిల్లి అజయ్‌కుమార్‌, టెక్కలి ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు బడ్డ రాజేష్‌, ఆట్ల రాహుల్‌కుమార్‌, కొండపల్లి రాకేష్‌, మురళిరెడ్డి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement