రైతులకు పరిహారం అందించాలి | - | Sakshi
Sakshi News home page

రైతులకు పరిహారం అందించాలి

Sep 27 2026 1:34 AM | Updated on Sep 27 2026 1:34 AM

రైతులకు పరిహారం అందించాలి

బూర్జ: రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని మాజీ స్పీకర్‌, శ్రీకాకుళం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ సమన్వయకర్త తమ్మి నేని సీతారాం డిమాండ్‌ చేశారు. నాగావళి ఉగ్రరూ పం దాల్చి వరద ముంపునకు గురైన అల్లెన, జి.బి.పురం, పనుకపర్త, లక్కుపురం గ్రామాల్లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లెన గ్రామంలో వరద రక్షణ గోడ వరద తాకిడికి గురైందన్నారు. ఈయనతో పాటు యువ నాయకుడు తమ్మినేని వెంకట చిరంజీవి నాగ్‌, మాజీ ఎంపీపీ కర్నేన దీప, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు బెజ్జిపురం రామారావు, వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గుమ్మడి రాంబాబు, జిల్లా ఐటీ విభాగం కార్యదర్శి తొత్తడి సురేష్‌, నాయకులు జడ్డు మహేశ్వరరావు, వి.కృష్ణ, వి.గోవిందరావు, ఎం.శ్రీనివాసరావు, జి.వెంకటరావు, కరణం అనిల్‌కుమార్‌, జడ్డు హరి, జడ్డు రమానంద, గిరి బాబు, ఎస్‌. శ్రీనివాసరావు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement