జిల్లా అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపికలు పూర్తి | - | Sakshi
Sakshi News home page

జిల్లా అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపికలు పూర్తి

Sep 21 2026 12:32 AM | Updated on Sep 21 2026 12:32 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా అథ్లెటిక్స్‌ క్రీడాకారుల ఎంపికలు పూర్తయ్యాయి. జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శ్రీకాకుళం కోడిరామ్మూర్తి స్టేడియం ప్రాంగణంలో జరిగిన ఈ ఎంపికలకు సుమారు 700 మంది క్రీడాకారులు హాజరయ్యారు. అండర్‌–14, 16, 18, 20 వయో విభాగాల్లో 100మీటర్లు, 200, 400, 800, 1500 మీటర్ల పరుగు పందాలు, 3కేఎం, 5కేఎం రన్స్‌, హైజంప్‌, లాంగ్‌జంప్‌, డిస్కస్‌త్రో, హేమర్‌త్రో, జావెలిన్‌త్రో, హార్డిల్స్‌ రన్స్‌, త్రోస్‌, జంప్స్‌ ఈవెంట్స్‌ను నిర్వహించారు. సెలక్షన్‌ ట్రయల్స్‌లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారుల వివరాలను నమోదుచేశారు. ఎంపికై న క్రీడాకారుల జాబితాను త్వరలో వెల్లడిస్తామని అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర, జిల్లా ఛైర్మన్‌ కొన్న వెంకటేశ్వరరావు (వాసు), రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు కొన్న మధుసూదనరావు, జిల్లా కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి తెలిపారు. అనంతరం సీనియర్‌ అథ్లెట్స్‌ పి.తవిటయ్య, ఎం.కామయ్య, కె.గోపిలను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఒలింపిక్‌ సంఘ జిల్లా సలహాదారు పి.సుందరరావు, కె.రాజారావు, కె.హరిబాబు, కె.మాధవరావు, టి.శ్రీనివాసరావు, బి.నారాయణరావు, వి.మురళి, రామారావు, మహంతి, సంఘ ప్రతినిధులు, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement