● శ్రీముఖలింగంలో రూపు కోల్పోతున్న విగ్రహాలు
● పట్టించుకోని పురావస్తు శాఖ అధికారులు
పర్యవేక్షణ
లోపం..
సిబ్బందిని ఏర్పాటు చేస్తాం
శ్రీముఖలింగం దేవాలయం అతి పురాతన మైనది. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మాతోపాటు దేవదాయ శాఖ, అర్చకులు, భక్తులు అందరిపై ఉంది. ఇలా పానపట్టం మీద దీపాలు, పసుపు కుంకుమలు పోయడంతో విగ్రహాలు యథా స్వరూపం కోల్పోతున్నాయి. అలా చేయకుండా ఇప్పటికే మా సిబ్బంది పర్యవేక్షణ ఉంది. నిత్య పరవేక్షణ కోసం అదనంగా సిబ్బందిని ఏర్పాటు చేసి విగ్రహాలకు ముప్పు కలగకుండా చర్యలు తీసుకుంటాం. భక్తులు దీపాలు పెట్టేందుకు స్టాండ్‌లు ఏర్పాట్లుచేస్తాం. – కె.మూర్తి, కన్జర్వేటివ్ అధికారి,
విశాఖపట్నం, కేంద్రపురావస్తు శాఖ
జలుమూరు: ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగంలో అష్ట దిక్పాలకుల మూర్తులు యథారూపాన్ని కోల్పో తున్నాయి. ఇక్కడ కొలువైన మధుకేశ్వురుడిని దర్శించుకునేందుకు ఏటా లక్షలాది భక్తులు వస్తుంటారు. ప్రధానంగా కార్తిక మాసం, శివరాత్రి, దస రా, వినాయక ఉత్సవాలకు భక్తులు దేశవిదేశాల నుంచి భక్తులు తండోపతండాలుగా వస్తుంటారు. ఈ దేవాలయంలో పూజలు, ధూపదీపాలు దేవదాయ శాఖ ఆధీనంలో నిర్వహిస్తుండగా.. వీటి పర్యవేక్షణ మాత్రం కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉంది. ఇక్కడ కొలువైన వివిధ దేవతా విగ్రహాలను సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఇవి యథా రూపా న్ని కోల్పోతున్నాయి. నిత్యం వందలాది మంది భక్తులు ఈ ఆలయం దర్శిచుకోవడంతోపాటు పూజలు, అభిషేకాలు, ఏకవార అభిషేకాలు, ప్రత్యేక పూజలు, ధూప దీపాలు పెడుతుంటారు. అలాగే కుంకుమార్చనలు, పుష్పాలతో అలంకరణ చేస్తుంటారు. దీని వల్ల విగ్రహాలు యథా స్వరూపం కోల్పోవడంతోపాటు వాటి ఉనికి కూడా ప్రమాదంగా మారిందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీముఖలింగం ప్రధాన ఆలయంలో కొలువైన ఇంద్రుడు, ఆగ్నేయేశ్వరుడు, హేమేశ్వరుడు, నైరుతేశ్వరుడు, వరుణేశ్వరుడు, వాయవేశ్వరుడు, కుభేరశ్వరుడు, ఈశానేశ్వరుడు విగ్రహాల వద్ద దీపాలు పెట్టి అలాగే వదిలేస్తుండడంతో అవి యథా స్వరూపాన్ని కోల్పోతున్నాయి. అలాగే డుండీ గణపతి సాక్షి గణపతి, చింతామణి గణపతి, కాలభైరవుడు తదితర విగ్రహాల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ప్రధానంగా శివుని లింగం పానపట్టం మీద అమ్మవారు అయిన పార్వతీ దేవి ఉంటుందన్నది శాస్త్ర ప్రమా ణం. అలాంటి పానపట్టం మీద ఇలా దీపాలు పెట్ట డం శాస్త్ర విరుద్ధం. కాని తెలియని భక్తులు కొందరు ఇలా దీపాలు పెట్టడంతో ఆ విగ్రహాలు రూపం, తేజస్సు కోల్పోతున్నాయి. వీటిని అడ్డుకోవాల్సిన దేవదాయ శాఖ కనీసం చర్యలు చేపట్టడం లేదు. కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉన్న ఈ దేవాలయంపై సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కూడా లేకపోవడం విగ్రహాలకు శాపంగా మారింది.


