శ్రీకాకుళం కల్చరల్: కళాకారుల సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బాపూజీ కళామందిర్‌లో శ్రీ సుమిత్ర కళాసమితి ఆధ్వర్యంలో అఖిల భారత బహుభాషా నాటిక పోటీలు గురువారం ప్రారంభమాయ్యాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యే గొండు శంకర్, డాక్టర్ కొంచాడ సోమేశ్వరరావు, సుడా ఈఈ పొగిరి సుగుణాకరరావు, నిక్కు హరిసత్యనారాయుణ, ఎల్.రామలింగస్వామి తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న నాటికలు..
తొలుత కోల్‌కతాకు చెందిన దాల్పుట్ మాణికతలా నాట్య సంస్థ ఆధ్వర్యంలో బెంగాలి నాటిక ‘జ్వాలా‘ ద్వారా దేశవిభజన, శరణార్థుల జీవితాల గురించి, దేశవిభజనలో కలిగిన వేదనలు కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. అనంతరం అసోంకు చెందిన ‘జీవశ్రేష్ట’ ద్వారా మానవీయ విలువలను ఎలా కాపాడుకోవాలో సందేశాత్మకంగా తెలియజేశారు. కార్యక్రమంలో ఇప్పిలి శంకర్‌శర్మ, మెట్ట పోలినాయుడు, కొంక్యాన మురళి, గుత్తు చిన్నారావు, మండవిల్లి రవి, కిల్లాన ఫల్గుణరావు, అశోక్‌కుమార్, లాడె చంద్రశేఖర్, వీవీఆర్ మూర్తి, జ్యోతి, పూజ, నక్క శంకరరావు తదితరులు పాల్గొన్నారు. శుక్రవారం మరాఠీ నాటిక ‘సూప్’, కన్నడ నాటిక ‘సాంగ్యా –బాల్య’ ప్రదర్శన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.


