అంబేడ్కర్‌ను కించపరిస్తే సహించం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ను కించపరిస్తే సహించం

Sep 18 2026 12:51 AM | Updated on Sep 18 2026 12:51 AM

శ్రీకాకుళం : రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌పై హమారా ప్రసాద్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ శ్రీకాకుళం నగరంలో జిల్లా దళిత ప్రజాసంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు దళిత ప్రజా సంఘాల ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరై డే అండ్‌ నైట్‌ కూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. హమారా ప్రసాద్‌ రచించిన ‘కల్పిత నాయకుడు’ పుస్తకాన్ని నిషేధించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

అంబేడ్కర్‌పై అవమానకర వ్యాఖ్యలు చేయడం సామాజికంగా ఉద్రిక్తతలకు దారితీసే అవకాశం ఉందని, మతోన్మాది హమారా ప్రసాద్‌పై దేశద్రోహం కేసు పెట్టి శిక్షించాలన్నారు. నిరసన కార్యక్రమంలో దళిత ప్రజాసంఘాల ఐక్యవేదిక నాయకులు పేడాడ కృష్ణారావు, బోకర నారాయణరావు, మిస్కా కృష్ణయ్య, రాయి వేణుగోపాల్‌, దుర్గాసి గణేష్‌, కంఠ వేణు, తైక్వాండో శ్రీను, యడ్ల గోపి, ఎస్సీ ఎస్టీ లాయర్స్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు బి.మురళీకృష్ణ, చలపతిరావు, ముక్కు ఆదినారాయణ, నటుకుల మోహనరావు, పోతుల దుర్గారావు, బోనెల అప్పారావు, ముస్లిం మైనార్టీ నాయకులు రఫీ, జర్నలిస్టు నల్లి ధర్మారావు, శాసపు జోగినాయుడు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement