ప్రతిభా అవార్డులతో విద్యార్థుల్లో స్ఫూర్తి | - | Sakshi
Sakshi News home page

ప్రతిభా అవార్డులతో విద్యార్థుల్లో స్ఫూర్తి

Sep 17 2026 12:50 AM | Updated on Sep 17 2026 12:50 AM

సంతబొమ్మాళి: విద్యార్థుల్లో స్ఫూర్తి నింపడానికి ప్రతిభా అవార్డులు దోహదపడతాయని మత్య్సకార సామాజిక సాంస్కృతిక సమితి జిల్లా అధ్యక్షుడు సూరాడ జోగారావు అన్నారు. బుధవారం పాతమేఘవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు స్వంతంగా షీల్డ్‌, నగదును సురాడ జోగారావు అందించారు. 2025–26 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 536 మార్కులతో ప్రథమ స్థానం సాధించిన బొంగు మోహనరావుకు షీల్డ్‌, రూ.3 వేలు నగదు, 534 మార్కులతో ద్వితీయ స్థానం సాధించిన బొంగు గోవిందరెడ్డికి షీల్డ్‌, రూ.2 వేలు నగదు, 531 మార్కులతో తృతీయ స్థానం సాధించిన పరిమిల్లి మౌనికకు షీల్డ్‌, రూ.వెయ్యి నగదుపాటు శాలువతో సన్మానం చేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ.. సూరాడ జోగారావు ఇదే పాఠశాలలో 15 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా సేవలు చేశారని తెలిపారు. కార్యక్రమంలో హెచ్‌ఎం మాధవరావు, మాజీ ఉప సర్పంచ్‌ మంకు సింహాచలం, మత్య్సకార నాయకుడు గంట ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement