19న జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

19న జాబ్‌మేళా

Sep 17 2026 12:50 AM | Updated on Sep 17 2026 12:50 AM

శ్రీకాకుళం న్యూకాలనీ: శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల డిగ్రీ (ఆర్ట్స్‌) కళాశాలలో నోడల్‌ జేకేసీ, కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో ఈ నెల 19న జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఎన్‌ఎస్‌ఎన్‌ స్వామి, జేకేసీ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ డి.అసిరితల్లి ఒక ప్రకటనలో తెలిపారు. హెటిరో ఫార్మాస్యూటికల్‌ సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీ కోసం శనివారం ఉదయం 9 గంటల నుంచి కళాశాలలో వాన్‌–ఇన్‌ ఇంటర్వ్యూలు జరుగుతాయని పేర్కొ న్నారు. డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఇంజినీరింగ్‌, ఇంటర్‌, ఐటీఐ అర్హతలు కలిగిన వివిధ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు బయోడేటాతో హాజరుకావాలని, మరిన్ని వివరాలకు 8074649919 నంబర్‌ను సంప్రదించాలని కోరారు.

నవోదయలో ప్రవేశాలకు

దరఖాస్తుల ఆహ్వానం

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: నవోదయ పాఠశాలలో 9, 11వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీకి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్‌ 30 అని, 2027 ఏప్రిల్‌ 10న ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్‌ (http://navodaya.gov.in)ను సంప్రదించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement