ఊరు.. మండపం | - | Sakshi
Sakshi News home page

ఊరు.. మండపం

Sep 16 2026 3:19 AM | Updated on Sep 16 2026 3:19 AM

ఒకే కుటుంబంలా మారుతున్న గ్రామాలు

ఒక్కటిగా చవితి వేడుకలు

76 ఏళ్లుగా..

ఆంధ్రా, ఒడిశా రాష్ట్ర ప్రజలు కలసి ఉండే గ్రామం మాది. రాష్ట్రాలు వేరైనా మేమంతా గత 76 ఏళ్లుగా ఒకే దగ్గర వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి వారం రోజుల పాటు ఘనంగా పూజలు చేస్తాం. ఎవరి స్థాయికి తగ్గట్టుగా వారు సహకారం అందిస్తూ పండుగను రెండు రాష్ట్రాల పండుగగా మార్చుకుంటాం.

– తిప్పన ధనుంజయరెడ్డి, టి.బరంపురం, ఇచ్ఛాపురం మండలం

పూర్వం నుంచి ఒకే వేదిక

అందరం కలసి ఒకే మండపం ఏర్పాటు చేసి పండుగను సామూహికంగా నిర్వహించాలన్నది మా పూర్వీకుల అభిప్రాయం. వారి అభిప్రాయాన్ని గౌరవిస్తూ చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా ఐక్యమత్యంగా గత 63 ఏళ్లుగా వినాయక పూజలు ఒకే దగ్గర చేస్తున్నాం. – దున్న గురుమూర్తి, బూర్జపాడు

ఒక్కటిగా.. ఒకే వేదికపై

గణనాథుడి పండుగ మనుషుల మధ్య దూరాలను పెంచేలా కాకుండా.. బంధాలను బలపరిచేలా ఉండాలనే ఉద్దేశంతో మా పూర్వీకులు 66 ఏళ్ల క్రితం మా గ్రామంలో ఒక్కటిగా వినాయక పూజలు చేయడం ప్రారంభించారు. ఒకే మండపం ఏర్పాటు చేస్తే ఆధ్యా త్మికతతో పాటు సామాజిక ఐక్యత కూడా పెరుగుతుంది. – చినపాన నాగరాజు, బెన్నుగానిపేట, ఇచ్ఛాపురం మండలం

ఇచ్ఛాపురం రూరల్‌:

వీధికి నాలుగు గణేశుని మండపాలు వెలుస్తున్న కాలంలో ‘ఒక ఊరు.. ఒకే వినాయకుడు.. ఒకే మండపం’ అంటూ దశాబ్దాలుగా ఐక్యతను చాటుతున్నాయి కొన్ని గ్రా మాలు. ఇచ్ఛాపురం మండలంలోని తిప్పనపుట్టుగ, బూర్జపాడు, బెన్నుగానిపేట, టీ. బరంపురం గ్రామాలు భక్తి పేరుతో విభజన కాకుండా భక్తితోనే ఐక్యతను పెంచుకోవచ్చ ని నిరూపిస్తున్నాయి. ఈ గ్రామాల్లో గ్రామస్తులంతా కలిసి ఒకే గణేష్‌ మండపాన్ని ఏర్పాటు చేస్తారు. అందరూ కలసి పూజలు నిర్వహిస్తారు. ఉత్సవ కార్యక్రమాల్లో ప్రతి క్కరూ భాగస్వామ్యులవుతారు. తరాలు మారినా.. సంప్రదాయం మారలేదు. ఈ గ్రామాల్లో గణేష్‌ ఉత్సవాల నిర్వహణలో ఐక్యత దశాబ్దాలుగా కొనసాగుతోంది. దీంతో పండుగ సమయంలో గ్రామం మొత్తం ఒక కుటుంబంలా మారుతుంది. పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నదానాలు తదితర కార్యక్రమాలను గ్రామస్తులంతా కలసి నిర్వహించడం ఇక్కడ ఆనవాయితీ.

సంతబొమ్మాళి: మూలపేట పోర్టు నిర్మాణం కోసం గ్రామాన్ని, భూములను త్యాగం చేసినా ఇప్పటికీ పరిహారం అందలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ మూలపేట నిర్వాసితులు వినూత్న నిరసన చేపట్టారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం గ్రామంలో కొలువుదీరిన గణనాథుడికి తమ సమస్యలను విన్నవిస్తూ పూజలు నిర్వహించారు. అధికారులను, ప్రజాప్రతినిధులు తమ గోడును పట్టించుకోవడం లేదని పేర్కొంటూ.. తమ పరిహారం అందేలా చూడాలని గణనాథుడిని వేడుకున్నారు. మూలపేట గ్రామంలో సుమారు 450 కుటుంబాలు ఉండగా, దాదాపు అందరూ గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాస ప్రాంతాలకు తరలివెళ్లారు. అయితే 50 కుటుంబాలకు ఇప్పటికీ పరిహారం అందకపోవడంతో గ్రామాన్ని వీడకుండా అక్కడే ఉండిపోయారు. పరిహారం చెల్లించే వరకు గ్రామం నుంచి కదిలేది లేదని వారు స్పష్టం చేస్తున్నారు. వీరిలో కొందరికి జీడితోటల పరిహారం అందాల్సి ఉండగా, మరి కొందరికి ఇళ్లకు సంబందించిన ఎస్టిమేషన్‌లో తేడాలు ఉన్నాయని నిర్వాసితులు చెబుతున్నారు. ఇంకొందరికి పీడిఎఫ్‌ పరిహారం ఖాతాల్లో జమకాలేదని వాపోతున్నారు. గ్రామంలో ఓ వైపు ఇళ్ల కూల్చివేతలు జరుగుతుండగా.. మరోవైపు పరిహారం కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలు గ్రామాన్ని విడిచి వెళ్లలేక అక్కడే ఉంటున్నాయి. తమకు రావాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం

వెంటనే చెల్లించి న్యాయం చేయాలని నిర్వాసితులు

వేడుకుంటున్నారు.

రెండు మండలాల ప్రజలం కలసి

అటు ఇచ్ఛాపురం, ఇటు కవిటి మండలాలకు చెందిన ప్రజలు మా గ్రామంలో ఉన్నారు. మండలాలు వేరైనా మేమంతా ఒక్కటే అంటూ గత 58 ఏళ్లుగా ఒకే ఊరు, ఒకే వినాయకుడు, ఒకే ఐక్యతగా సాగుతున్నాం.

– తిప్పన శంకర్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఐ,

తిప్పనపుట్టుగ, ఇచ్ఛాపురం మండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement