● టెక్కలి వైఎస్సార్‌సీపీ కార్యకర్తల
విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ
సీనియర్ నేతలు ధర్మాన ప్రసాదరావు, కృష్ణదాస్, కుంభా రవిబాబు
మాట్లాడుతున్న మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. చిత్రంలో ధర్మాన కృష్ణదాస్,
కుంభా రవిబాబు, జెడ్పీ చైర్ పర్సన్ పిరియా విజయ, పేరాడ తిలక్ తదితరులు
టెక్కలి: చంద్రబాబును గద్దెనెక్కించి తప్పు చేశామని ప్రజలు పశ్చాత్తాప పడుతున్నారని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయంతో చంద్రబాబుకు గట్టిగా గుణపాఠం చెప్పడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసు, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు అన్నా రు. టెక్కలిలో మంగళవారం పార్టీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో వారు మాట్లాడారు. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ.. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు చంద్రబాబు వెనకడుగు వేశారని, కానీ ఇప్పుడు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. కూట మి రెండున్నరేళ్లలో అన్ని వ్యవస్థలను నాశనం చేసిందని, ఈ విషయాలను ప్రజలకు వివరించాలన్నారు. అన్యాయం జరిగిందని పోలీస్‌స్టేషన్‌కు వెళ్తే తిరిగి వేధిస్తున్నారని తెలిపారు. డీఎస్సీ అక్రమాలన్నీ బయటపడ్డాయన్నారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలంతా ఐకమత్యంగా పోరాడాలన్నారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ కూటమి ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రా న్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని, సుమారు 92 లక్షల 70 వేల కోట్ల రూపాయలు అప్పుల భారం వేశారని ఆరోపించారు. వారు అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 6 లక్షల పెన్షన్‌లు తొలగించేశారని తెలిపారు. టెక్కలిలో అధికారులు కూడా అచ్చెన్నాయుడు అండ చూసుకుని రెచ్చిపోతున్నారని, వారిని విడిచిపెట్టేది లేదని పార్టీ టెక్కలి సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు.


