భూమి ఉంటే రూ.15వేలు
● అడిగినంత ఇస్తే కొత్త పింఛన్‌కు అర్హులే
● సచివాలయ ఉద్యోగులపై
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు
కాశీబుగ్గ :
రాక రాక వచ్చిన కొత్త పింఛన్ల అవకాశాన్ని టీడీపీ నాయకులు సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త పింఛన్లకు దరఖాస్తు లు తీసుకోవడం సచివాలయ ఉద్యోగులకు కత్తీమీద సాములా మారింది. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతో అర్హులు కాని వారిని సైతం పరిగణించాల్సి వస్తోంది. ఈ పరిణామాలు భవిష్యత్‌లో తమ ఉద్యోగాల కు ఎలాంటి ముప్పు తెస్తుందో అని కలవరపడుతున్నారు. స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూటమి ప్రభుత్వం నూతన పింఛన్ల ముసుగులో పార్టీ శ్రేణులకు ఉపాధి మార్గం కల్పించింది. దీంతో కొందరు అర్హత లేనివారితో సైతం దరఖాస్తు పెట్టిస్తున్నారు. కారు ఉన్నవాళ్ల నుంచి రూ. 20వేలు, పరిమితికి మించి భూమి ఉంటే రూ.15వేలు ఇలా ఒక్కో కొర్రీ కి ఒక్కో రీతిలో వసూళ్లకు పాల్పడుతున్నారు. రోజుకు రూ. వేలల్లో వసూళ్లకు తెరలేపారని స్థానికంగా చర్చ జరుగుతోంది.
అనర్హులకు ఆశ చూపి
దరఖాస్తు చేసేవారిలో ఎక్కువ మంది అనర్హులు ఉండటంతో వాటిని ఆసరాగా తీసుకుని ఆదాయ వన రుగా మార్చుకుంటున్నారు. సగటున ఒక్కో దర ఖాస్తు నుంచి రూ. 10వేలకు తగ్గకుండా తీసుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్లు, భూములు ఉన్నవారు, పన్నులు చెల్లించేవారంతా అనర్హులు. కానీ ఇవేమీ వారికి పట్టడం లేదు. ప్రభు త్వం మాది, మేం సూచించేవారికే పింఛన్ వస్తుందంటూ డాంబికాలు పలుకుతున్నారు. నూతన పింఛన్ల దరఖాస్తుకు ఈనెల 16 ఆఖరు కావడంతో ఎక్కువమందితో దరఖాస్తు పెట్టించేందుకు వసూ లు రాయుళ్లు తహతహలాడుతున్నారు. అనర్హులని తెలిసినప్పటికీ అలాంటి వారితో నాయకులు దగ్గరుండి దరఖాస్తు చేయడంపై సచివాలయ ఉద్యోగులు ఈసడించుకుంటున్నారు.


