ఈ చిన్నారి పేరు రేఖ బెహరా. నాల్గో తరగతి చదువుతున్న ఈ బుజ్జాయి పుట్టుకతోనే దివ్యాంగురాలు. మెళియాపుట్టి మండ ల కేంద్రంలోనే వీరి కుటుంబం నివాసం ఉంటోంది. ఒడిశా నుంచి వచ్చినా ఆంధ్రాలోనే స్థిరపడ్డారు. ఇక్కడే రేషన్, ఆధార్ అన్నీ ఉన్నా యి. కానీ ఈ చిన్నారికి ఇంతవరకు దివ్యాంగ పింఛన్ మంజూరు కాలేదు. బాలిక తండ్రి దుర్యోధన కూలి పనులు చేస్తుంటారు. కుమార్తెకు పింఛన్ మంజూరైతే ఆమె జీవితానికి కాసింత ఆధారం దొరుకుతుందని ఆ తండ్రి అభ్యర్థిస్తున్నారు. అధికారులు స్పందించాలని కోరుతున్నారు. – మెళియాపుట్టి


