టెక్కలి రూరల్: కోటబొమ్మాళిలో బుధవారం ఆరేళ్ల చిన్నారితో అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు రావడంతో బుధవారం రాత్రి ఓ వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం.. గుజిలోవా గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు భార్య చనిపోయాక కోటబొమ్మాళిలో నివాసం ఉంటున్నాడు. తన ఇంటికి సమీపంలో ఉన్న ఓ చిన్నారిని బుధవారం మేడపైకి తీసుకెళ్లి ఆ చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తించడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వారు పోలీసులను ఆశ్రయించగా పోలీసులు ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం బుధవారం రాత్రి టెక్కలి జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. వృద్ధుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇద్దరిపై పోక్సో కేసు నమోదు
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రం పరిధిలోని 16 ఏళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఇద్దరు యువకులపై కేసులు నమోదు చేసినట్లు మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ భాస్కరరెడ్డి తెలిపారు. బాలిక తల్లిదండ్రులు లేనప్పుడు యువకులు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పారు.


