● పలాస కిడ్నీ పరిశోధన ఆస్పత్రిపై వికృతచర్య ● శిలాఫలాకాలపై చిరునామాల తొలగింపు ● ఆస్పత్రి బోర్డుల ధ్వంసం
ఇన్ పేషెంట్ విభాగం భవనంపై భాగంలో పైశాచిక చర్యకు ప్రత్యక్ష తార్కాణం
ఓపీ విభాగం భవనంపై భాగంలో డాక్టర్ వైఎస్సార్ పేరును ధ్వంసం చేసిన వైనం
ఉత్తరాంధ్ర ఊపిరిపై ఉన్మాదం
ఉత్తరాంధ్ర ఊపిరి, ఉద్దానం ప్రజల ఆశాదీపంగా భాసిల్లుతున్న పలాస కిడ్నీ పరిశోధన ఆస్పత్రిపై ఉన్మాద పర్వం కొనసాగుతోంది. వైఎస్సార్ సీపీ హయాంలో నిర్మితమైన ఆస్పత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన శిలాఫలకాలను తొలగించారు. ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆస్పత్రిని ప్రారంభించిన విషయాన్ని తెలియపరిచేలా ఏర్పాటుచేసిన శిలాఫలకాలను తొలగించారు. మహానేత వైఎస్సార్ విగ్రహం కింద బోర్డులను మాయం చేశారు. ఆస్పత్రి ఇన్ పేషెంట్, ఔట్ పేషెంట్ భవంతులపై డాక్టర్ వైఎస్సార్ కిడ్నీ రీసెర్చ్ ఆస్పత్రి పేరుతో ఏర్పాటు చేసిన బోర్డులనూ ధ్వంసం చేయగా.. వాటిని సరిచేయకుండా అలానే వదిలేశారు. పైగా ఆస్పత్రి సాకారంలో ఎలాంటి ప్రమేయం లేని వారి పేర్లతో కూడిన శిలాఫలకాన్ని నెలకొల్పి నవ్వుల పాలవుతున్నారు. –కాశీబుగ్గ
దివంగత నేత వైఎస్సార్ విగ్రహం దిగువ ఆస్పత్రిని ప్రారంభించిన వివరాలను తొలగించిన దృశ్యం
ఈ ఆస్పత్రికి చంద్రబాబునాయుడు శంకుస్థాపన చేసినట్లు సూచిస్తూ ఏర్పాటుచేసిన ఫలకం


