సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
మూడుసార్లు గెలిచామని అహంకారమో.. అధికారం ఉందనే విచ్చలవిడితనమో...దోపిడీ చేస్తే తమను ఎవరు అడ్డుకుంటారనే విపరీత ధోరణో తెలియదు గానీ ఇచ్ఛాపురం నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల అరాచకాలకు అడ్డూఅదుపు లేకుండాపోతోంది. నియోజకవర్గాన్ని ప్రాంఛైజీలుగా విడగొట్టుకుని అడ్డగోలుగా దోచేస్తున్నారు. ఇష్టారాజ్యంగా సహజ వనరులను ధ్వంసం చేసి పెట్రేగిపోతున్నారు. నిషేధిత జాబితాలో ఉన్న భూములను తొలగిస్తామని, పట్టాలిప్పిస్తామని అందిన కాడికి దండుకుంటున్నారు. ఇసుక, మద్యం, కంకర, అక్రమ మైనింగ్, గంజాయి, నాటుసారా తదితర మత్తులో మునిగితేలుతున్నారు.
అంతా అక్రమమే..
● కంచిలి మండలంలో రామారావు అనే వ్యక్తి అవినీతిలో చెలరేగిపోతున్నాడు. సహజ వనరులను దోచేస్తున్నాడు. జలంత్ర కోట సమీపంలో నడుస్తున్న అక్రమ క్వారీల నుంచి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నాడు. పశువుల అక్రమ వ్యాపారం వెనకుండి చేయిస్తున్నాడు. అంగన్‌వాడీ న్యూట్రీషియన్ పోస్టుల నుంచి అవుట్ సోర్సింగ్ పోస్టులు వరకు అమ్ముకున్నాడు. కంచిలి మండలం మండపల్లి పంచాయతీలోని కొండలను తవ్వి రియల్ ఎస్టేట్ వెంచర్లకు విక్రయించేశాడు.
● సోంపేట మండలంలో మోహన్, కుమార్‌ల అక్రమాలకు కీలక నేత గేట్లెత్తేశారు. బాతుపురం మహేంద్ర తనయ నది నుంచి వందలాది ట్రాక్టర్లలో ఇసుక తరలించి అక్రమంగా సంపాదిస్తున్నారు.
● శ్రీకాంత్ అనేవ్యక్తి ఆధ్వర్యంలో మద్యంసిండికేట్‌ను బాటి ల్‌పై రూ.20 నుంచి రూ.40 వరకు పెంచి మందుబాబులను దోచుకుంటున్నారు. సారా తయారీదారుల నుంచి కూడా తెలుగు తమ్ముళ్లు పెద్ద ఎత్తున వసూలు, అక్రమ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నారు. విచ్చలవిడిగా అటవీ సంపదను తరలించుకుని సొమ్ము చేసుకుంటున్నారు.
కీలకనేత కనుసన్నల్లో..
ఇక్కడ మద్యం సిండికేట్ చెలరేగిపోతోంది. మహేంద్రగిరి, బాహుదా నదుల్లో ఇసుక దోచేస్తున్నారు. పల్లె పండగలో భాగంగా నాసిరకం రోడ్లు వేసి సొమ్ము చేసుకుంటున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు అమ్ముకున్నారు. చివరికి బా ణసంచా షాపుల ఏర్పాటుకు సైతం అక్రమ వసూళ్లు చేశారు. ఇదంతా నియోజకవర్గ కీలక నేత కనుసన్నల్లోనే జరుగుతోందని, అంతిమ లబ్ధి ఆయనకే దక్కుతోందని సమాచారం.
నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుతమ్ముళ్ల దోపిడీ
సెటిల్‌మెంట్లు, భూ ఆక్రమణలు, అక్రమ వసూళ్లు
యథేచ్ఛగా అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ తవ్వకాలు
ఎంఆర్‌పీకి మించిన ధరలతో మద్యం విక్రయాలు
కీలక నేత అండతో రెచ్చిపోతున్న అక్రమార్కులు
ఇచ్ఛాపురంలో అంతర్రాష్ట్ర సరిహద్దు లో జరిగే అక్రమ వ్యాపారాల వ్యవహారాన్నీ ఓ వ్యక్తి చేతిలో పెట్టేశారు. ఆయ న అడ్డు అదుపూ లేకుండా రెచ్చిపోతున్నాడు. బాహుదా ఇసుకను కూడా సదరు వ్యక్తి పర్యవేక్షణలోనే అక్ర మంగా రవాణా చేస్తున్నారు. రత్తక న్న పీర్లుకొండను తవ్వేసి, కంకర రవా ణా చేసి సొమ్ము చేసుకున్నారు. పచ్చ నాయకులు రత్తకన్న డిగ్రీ కళాశాల వద్ద జగనన్న కాలనీ లేఅవుట్‌లో మిగులు స్థలాలను ఆక్రమించారు. కవిటిలో కీలక నేత సొంతూరులోని తన ఇంటికి సమీపంలో ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు. ఆయన మామ ఆగడాలకు అడ్డే లేదు. ప్రభుత్వ నిషేధిత భూములు తొలగిస్తామని, పట్టాలు ఇస్తామని రూ.లక్షల్లో డబ్బులు తినేశారు. ఇచ్ఛాపురం మార్కెట్ కమిటీలో అవుట్ సోర్సింగ్ పోస్టులు, రాజపురం వసతి గృహం వాచ్‌మెన్ పోస్టుల్లో కావాల్సిన వారిని వేసుకున్నారు. కవిటి పంచాయతీలోని బొర్రపుట్టుగ వద్ద ఓ టీడీపీ నాయకుడు ప్రభుత్వ భూమిని ఆక్రమించగా, ‘సాక్షి’లో కథనం ప్రచురితమయ్యాక అడ్డుకున్నారు.


