వద్దంటే వినరే
● డీజే శబ్దాలతో పెను ముప్పు
● గత ఏడాది వినాయక ఉత్సవాల్లో డీజే శబ్దానికి నరసన్నపేటలో కూలిన పోర్టికో
● డీజేల వినియోగం నిషేధించాలంటున్న ప్రజలు
అధిక శబ్దంతో ఆరోగ్య సమస్యలు
డీజేల వల్ల అధిక శబ్దం వస్తుంది. ఇది ఆరోగ్యపరంగా మంచిది కా దు. ప్రధానంగా వినికిడి సమస్య, గుండె పోటు సంభవించే అవకాశం ఉంది. అలాగే గర్భిణులకు అధిక శబ్దం మంచిది కాదు. చిన్న పిల్లల్లో వినికిడి సమస్య ఉత్పన్నం కావచ్చు.
– తాడేల శ్రీకాంత్, అదనపు డీఎంహెచ్‌ఓ
అనుమతి తప్పనిసరి
డీజేలు ఏర్పాటు చేస్తే విధిగా అనుమతి తీసుకోవాలి. ఇష్టానుసారంగా డీజేలు ఏర్పాటు చేసి స్థానికులకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు. – ఎం.శ్రీనివాసరావు, సీఐ, నరసన్నపేట
నరసన్నపేట : డీజే.. పండగ ఏదైనా డీజే శబ్దం లేకపోతే ముగింపు జరగడం లేదు. యువతకు ఈ శబ్దా లు ఇంపుగానే ఉన్నా.. చాలా మందికి ఇది ప్రాణ సంకటంగా మారుతోంది. గత ఏడాది వినాయక నవరాత్రుల ఊరేగింపులో నరసన్నపేట టౌన్‌లోని భవానీ పురం వీధిలో డీజే శబ్దానికి శిథిల భవనం పోర్టికో కూలడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడు వినాయక నవరాత్రులు వస్తుండడంతో డీజేల మోత ఖాయంగా కనిపిస్తోంది. వినాయక నిమజ్జనం సందర్భంగా పలు ఉత్సవ కమిటీలు డీజేలను ఇప్పటికే బుక్ చేశారు. అయితే ఈ డీజే సౌండ్ వల్ల మనిషికి ఎంతటి హాని కలుతుందన్న విషయం ఉత్సవ కమిటీలు ఆలోచించడం లేదు. దీంతో పర్యావరణ వేత్తలతో పాటు స్థానికులు, విద్యా వంతులు ఆందోళన చెందుతున్నారు.
మార్గదర్శకాలు ఇలా..
● బహిరంగ ప్రదేశాల్లో 10 డెసిబుల్స్‌కు మించి శబ్దం చేయరాదు.
● ప్రైవేటు ప్రదేశాల్లో డీజేలు పెట్టకూడదు. అను మతి లేకుండా సౌండ్ బాక్స్‌లు అమర్చకూడదు.
● నిషిద్ధ ప్రాంతాలుగా గుర్తించిన ప్రదేశాల్లో సంగీత ధ్వనులు, డ్రమ్స్ కొట్టడం ఇతర శబ్దాలు చేయకూడదు. ఆస్పత్రులు, విద్యా సంస్థలు, దే వాలయాలు, న్యాయ స్థానాలకు వంద మీటర్లు లోపు డీజేలు ఏర్పాటు చేయకూడదు.


