సోంపేట: మండలంలోని బారువ గ్రామంలో సాయిబాబా గుడి సమీపంలోని చెరువులో పడి గ్రామానికి చెందిన బురకాయల కామరాజు(70) మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చెరువు వద్దకు వెళ్లి ప్రమాదవశాత్తు పడి మృతి చెందినట్లు పేర్కొన్నారు. బుధవారం ఉదయం మృతదేహం చెరువు ఒడ్డున ఉండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందజేశారు. బారువ పోలీసులు కేసు నమోదు చేశారు. గ్రామంలో వివరాలు సేకరించి గ్రామానికి చెందిన బురకాయల కామరాజు మృతదేహంగా గుర్తించారు. కామరాజుకు భార్య చంద్రావతి, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు బారువ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
కంటైనర్ బోల్తా
టెక్కలి రూరల్: స్థానిక ఆదిఆంధ్ర వీధి సమీప జాతీయ రహదారిపై బుధవారం కంటైనర్ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ మేరకు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవా నుంచి కలకత్తా వెళ్తున్న ఈ కంటైనర్ లారీ టెక్కలి సమీప ఆదిఆంధ్ర వీధి వద్దకు వచ్చేసరికి ఒక్కసారిగా అదుపుతప్పి సమీప డివైడర్‌ను ఢీకొని బోల్తాపడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు గానీ.. సహాయకుడికి గానీ ఎటువంటి గాయాలవ్వలేదు. లారీ రహదారికి అడ్డంగా పడిపోవడంతో విషయం తెలుసుకున్న హైవే సిబ్బంది ఘటన స్థలానికి చేరకొని క్రైన్ సాయంతో లారీని తొలగించి ట్రాఫిక్‌ను సరిచేశారు. ఈ ఘటనపై టెక్కలి పోలీసులు వివరాలు సేకరించారు.


