సంతబొమ్మాళి: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మండలంలోని పాలతలగాం గ్రామానికి చెందిన కొర్రాయి లక్ష్మణ్‌కు రూ.10 వేల జరిమానా కోటబొమ్మాళి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి విధించినట్లు సంతబొమ్మాళి ఎస్‌ఐ వై.సింహాచలం బుధవారం తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, ఒకవేళ వాహనం నడిపితే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
జాతీయ పోటీలకు నందిని
శ్రీకాకుళం న్యూకాలనీ: ఆలిండియా సీనియర్ నేషనల్స్ బాల్ బాడ్మింటన్ ఛాంపియన్ షిప్ పోటీలకు శ్రీకాకుళం జిల్లాకు చెందిన స్టార్ క్రీడాకారిణి సింగూరు నందిని ఎంపికై ంది. ఈ పోటీలు సెప్టెంబర్ 24 నుంచి 28వ తేదీ వరకు శ్రీకాళహస్తి వేదికగా జరగనున్నాయి. రాష్ట్రస్థాయి పోటీల్లో క్రీడాకారుల రాణింపు ఆధారంగా ఏపీ రాష్ట్ర బాల్ బాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ ప్రకటించిన రాష్ట్ర మహిళా జట్టు జాబితాలో నందిని చోటు నిలబెట్టుకుంది. ఎచ్చెర్లకు చెందిన ఈ యువ క్రీడాకారిణి ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో విద్యాభ్యాసం కొనసాగిస్తోంది. నందిని జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై సంఘ ప్రతినిధులు, సీనియర్ క్రీడాకారులు, ఒలింపిక్, పీడీ–పీఈటీ సంఘ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
గుర్తు తెలియని మృతదేహం లభ్యం
శ్రీకాకుళం క్రైమ్: జిల్లా కేంద్రంలోని డే అండ్ నైట్ సమీప కార్‌షెడ్ వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యం కావడంతో కేసు నమోదు చేసినట్లు రెండో పట్టణ సీఐ ఈశ్వరరావు వెల్లడించారు. బుధవారం రాత్రి స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటనా స్థలానికి వెళ్లామని, మృతునికి సుమారు 45 సంవత్సరాల వయస్సు ఉంటుందని తెలియజేశారు.


