27 మద్యం బాటిళ్లు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

27 మద్యం బాటిళ్లు స్వాధీనం

Sep 8 2026 12:59 AM | Updated on Sep 8 2026 12:59 AM

సోంపేట: సోంపేట ఎకై ్సజ్‌ స్టేషన్‌ పరిధి సోంపేట, కంచిలి, మందస మండలాల్లోని పలు గ్రామాల్లో సోమవారం బెల్టు దుకాణాలపై దాడులు నిర్వహించి 27 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని నలుగురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ జీవీ రమణ తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఇద్దరు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు తెలియజేశారు. దాడుల్లో ఎస్‌ఐ ప్రసాద్‌, సిబ్బంది భానుప్రసాద్‌, గుణాకర్‌, ఉమాపతి తదితరులు పాల్గొన్నారు. కాగా సోంపేట ఎకై ్సజ్‌స్టేషన్‌ వద్ద మంగళవారం మధ్యాహ్నం 1 గంటకు నాటుసారా కేసుల్లో సీజ్‌ చేసిన ఒక ఆటో, రెండు ద్విచక్ర వాహనాలు వేలం వేయనున్నట్లు వెల్లడించారు.

ఎస్పీ గ్రీవెన్సుకు

58 వినతులు

శ్రీకాకుళం క్రైమ్‌: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పబ్లిక్‌ గ్రీవెన్సు కార్యక్రమంలో బాధితుల నుంచి 58 ఫిర్యాదులు అందాయి. అదనపు ఎస్పీ పి.శ్రీనివాసరావు బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఆస్తి తగాదాలు, కొట్లాటలు, కుటుంబ కలహాలు, మోసపూరిత ఘటనలకు సంబంధించిన అంశాలపై ఫిర్యాదులందాయి.

యాక్సిస్‌ బ్యాంకు డైరెక్టర్‌గా శేషగిరిధర్‌

జి.సిగడాం(పొందూరు): స్థానిక పోస్టాఫీస్‌ వీధికి చెందిన కుప్పిలి శేషగిరిధర్‌ యాక్సిస్‌ బ్యాంకు బోర్డు డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం బొంబాయిలో ఉన్న యాక్సిస్‌ బ్యాంకు బోర్డు నుంచి ఆదేశాల వచ్చాయి. ఆయన గతనెల 31న ఎల్‌ఐసీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈయన సేవలను గుర్తించి యాక్సిస్‌ బ్యాంకు బోర్డు డైరెక్టర్‌గా ఎంపిక చేశారు. దీంతో గిరిధర్‌ను పలువురు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement