‘నీరివ్వండి మహాప్రభో’ | - | Sakshi
Sakshi News home page

‘నీరివ్వండి మహాప్రభో’

Aug 28 2026 2:33 AM | Updated on Aug 28 2026 2:33 AM

‘నీరివ్వండి మహాప్రభో’

నరసన్నపేట: మండలంలోని గోపాలపెంటకు సాగునీరు విడుదల చేయాలని, నీరు లేక పొలాలు ఎండిపోతున్నాయని నీటి సంఘం గోపాలపెంట డైరెక్టర్‌ తోట భార్గవ్‌, రైతులు బొబ్బాది ఈశ్వరరావు, గదిలి రమేష్‌, సనపల రమేష్‌, మార్పు అమ్మాజీ బుడుమూరు రమణ తదితరులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం స్థానిక వంశధార ఈఈ కార్యాలయ హెచ్‌డీ నారాయణమూర్తికి విన తి పత్రం అందించారు. ఈ సందర్భంగా బొబ్బాది ఈశ్వరరావు మాట్లాడుతూ కాలువల్లో పూడిక తీయలేదని, చుక్క నీరు రావడం లేదని ఆందోళన చెందారు. ఏటా నష్ట పోతున్నామని, వంశధార అధికారులు పట్టించుకోవడం లేదని అన్నారు. ఇకనైనా చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement