పాతపట్నం: పాతపట్నంలో చంటి బిర్యానీ హొటల్ నడుపుతున్న కొల్లి చిన్నారా వు అలియాస్ చంటి (38) గురువారం ఉదయం హొటల్‌లో ఫ్యాన్ హుక్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరా ల ప్రకారం.. పాతపట్నం మేజర్ పంచాయతీ రాళ్ల క్వారీలో కొల్లి చిన్నారావు అలియాస్ చంటి నివసిస్తున్నాడు. పాతపట్నం యూనియన్ బ్యాంకు పక్కన చంటి బిర్యానీ హోటల్‌ను నెల రోజుల కిందట ప్రా రంభించాడు. గురువారం ఉదయం 8 గంటల సమయంలో ఇంటి నుంచి హోటల్‌కు చేరుకుని, హోటల్ షట్టర్ తీసుకుని, లోపలకి వెళ్లి షట్టర్‌ను మూసివేసి, హోటల్ లోపల గదిలోకి వెళ్లి ఫ్యాన్ హుక్‌కు ఉరివేసుకున్నాడు. రోజూ లాగానే హోటల్‌కు తల్లి కొల్లి వెంకటలక్ష్మి, భార్య రాణిలు చేరుకుని, షట్టర్ తీసి చూడగా ఫ్యాన్ హుక్‌కు మృతదేహం వేలాడుతూ కనిపించింది. వెంటనే వారు 104కు ఫోన్ చేసి పాతపట్నం సీహెచ్‌సీకు తరలించారు. అప్పటికే చిన్నారావు మృతి చెందాడు. సంఘటన స్థలానికి ఎస్‌ఐ కె.మధుసూదనరావు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
చిన్నారావు ఒడిశాకు చెందిన ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడని, ఆమె వద్ద కొంత బంగారం తాకట్టు పెట్టి నగదును, బయట కూడా అప్పులు తెచ్చి, హోటల్‌కు పెట్టుబడి పెట్టాడని మృతుడి భార్య పోలీసు ఫిర్యాదులో పేర్కొన్నారు. నీలిమకు తన భర్త చిన్నారావు ఇటీవల మనస్ఫర్థలు వచ్చాయని, నీలిమ తన దగ్గర తీసుకున్న పద్దు పెట్టిన నగదు ఇమ్మని తన భర్తను అడిగిందని, అప్పుల బాధతో తన భర్త మృతి చెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతుడికి కుమార్తె, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు.


