లారీని ఢీకొట్టిన ఆటో | - | Sakshi
Sakshi News home page

లారీని ఢీకొట్టిన ఆటో

Aug 26 2026 1:24 AM | Updated on Aug 26 2026 1:24 AM

నరసన్నపేట: జమ్ము కూడలి సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం ఆగి ఉన్న లారీని విజయనగరం జిల్లా జామి నుంచి పలాస వైపు వెళ్తున్న ఆటో బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న శ్రావణ్‌కుమార్‌, వెంకటరమణలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటో ముందు భాగం పూర్తిగా నుజ్జు కావడంతో డ్రైవర్‌తో పాటు పక్కనే కూర్చున్న వెంకటరమణ ఇరుక్కున్నారు. వారిని బయటకు తీయడానికి స్థానికులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. సమాచారం తెలుసుకున్న నరసన్నపేట ఎస్‌ఐ బి.గణేష్‌ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహకారంతో క్షతగాత్రులను బయటకు తీశారు. అనంతరం శ్రీకాకుళం రిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్‌ సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ అతి వేగంగా వాహనం నడుపుతుండటమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. నరసన్నపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

క్షతగాత్రులను కాపాడిన స్థానికులు, ఎస్సై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement