ఆత్మ విశ్వాసమే ఆయుధం | - | Sakshi
Sakshi News home page

ఆత్మ విశ్వాసమే ఆయుధం

Aug 23 2026 12:34 AM | Updated on Aug 23 2026 12:34 AM

ఆత్మ విశ్వాసమే ఆయుధం

టెక్కలి: విద్యార్థులు తమ కలలకు రెక్కలు తొడిగేలా ఆత్మ విశ్వాసమే ఆయుధంగా నిరంతరం ప్రణాళికతో చదివి విజయ శిఖరాలను అధిరోహించాలని సినీ నటు డు, మోటివేటర్‌ ప్రదీప్‌ కొండిపర్తి ఆకాంక్షించారు. టెక్కలి ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాల సిల్వర్‌ జూబ్లీ కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన అలు మ్నీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విజయం ఒక్క రోజులో దక్కేది కాదని, నిరంతరం నేర్చుకోవడం, వైఫల్యాలను చవిచూడడం, వాటి ద్వారా పాఠాలను నేర్చుకోవడం అలవాటు చేసుకోవాలన్నారు. అనంతరం కళాశాల ప్రాంగణాన్ని సందర్శించి విద్యా ప్రమాణాలను పరిశీలించారు. సిల్వర్‌ జూబ్లీ ప్రయాణం గూర్చి కళాశాల యాజమాన్యం వివరించా రు. కళాశాల చైర్మన్‌ డాక్టర్‌ కె.సోమేశ్వరరావు, కార్యదర్శి ఎల్‌.ఎల్‌.నాయుడు, కోశాధికారి టి.నాగరాజు, డైరెక్టర్లు వి.వి.నాగేశ్వరరావు, మధుకుమార్‌, నాగశేషు, ప్రిన్సిపా ల్‌ ఎ.ఎస్‌.శ్రీనివాసరావు, అలుమ్ని కో–ఆర్డినేటర్‌ డి. యుగంధర్‌, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement