జూనియర్‌ డాక్టర్ల నిరసన ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ డాక్టర్ల నిరసన ర్యాలీ

Aug 23 2026 12:34 AM | Updated on Aug 23 2026 12:34 AM

జూనియర్‌ డాక్టర్ల నిరసన ర్యాలీ

శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్‌ వైద్య కళాశాలలోని జూనియర్‌ డాక్టర్లు శనివారం ర్యాలీ నిర్వహించారు. హాస్పిటల్‌ నుంచి అంబేడ్కర్‌ జంక్షన్‌ వరకు ర్యాలీ కొనసాగిస్తూ దారి పొడవునా తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం మానవహారంగా ఏర్పడి నిరసన వ్య క్తం చేశారు.

ఈ సందర్భంగా పలువురు జూనియర్‌ డాక్టర్లు మాట్లాడుతూ ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు తీర్చకుండా జాప్యం చేయడం తగదన్నారు. నిబంధనల ప్రకారం ఇవన్నీ తమకు రావాల్సి ఉందని, తాము అదనంగా ఏమీ అడగడం లేదని చెప్పారు. సోమవారం నాటికి సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్‌ ప్రసన్న రాజు, డాక్టర్‌ రాజ్‌ సుదర్శన్‌, డాక్టర్‌ చాందిని, డాక్టర్‌ నరేంద్ర నాయక్‌, డాక్టర్‌ జాన్‌ వెస్లీ, డాక్టర్‌ లక్ష్మీకాంత్‌, డాక్టర్‌ మురళి, డాక్టర్‌ శశిభూషణ్‌, డాక్టర్‌ సతీష్‌, డాక్టర్‌ దీపిక, డాక్టర్‌ హేమంత్‌, డాక్టర్‌ చానేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement