శ్రీకాకుళం: శ్రీకాకుళం రిమ్స్ వైద్య కళాశాలలో జూ నియర్ డాక్టర్లు, సూపర్ స్పెషాలిటీ పీజీ విద్యా ర్థులు, హౌస్ సర్జన్లు చేపట్టిన నిరాహార దీక్షలు గురువారం నాటికి మూడో రోజుకు చేరుకున్నాయి. గురువారం రాష్ట్రస్థాయిలో అధికారులు జూనియర్ డాక్టర్ల సంఘ నాయకులతో జరిపిన చర్చలు విఫలం కావడంతో శుక్రవారం నుంచి ఆందోళనను మరింత ఉద్ధృతం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ వివరాలను శుక్రవారం ఉదయం వెల్లడిస్తారు. గురువారం నాటి దీక్షలో డాక్టర్ లక్ష్మీకాంత్, డాక్టర్ ధర్మాకర్, డాక్టర్ కృష్ణ, డాక్టర్ లావణ్య, డాక్టర్ దిలీప్, డాక్టర్ హేమంత్, డాక్టర్ రాజ్ మనోహర్, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు


