నరసన్నపేట మేజరు పంచాయతీలో 20 వార్డులు, 120 వీధులు, 40 వేల మంది జనాభా నుంచి సేకరిస్తున్న చెత్త అంతా ప్రస్తుతం ఇదే ప్రాంగణంలో ఐదెకరాల విస్తీర్ణంలో పేరుకుపోతోంది. పరిసరాలు అంతా దుర్వాసన వెదజల్లుతున్నాయి. సమీప జగన్నాథపురం తదితర వీధుల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ చెత్త నుంచి మోక్షం కలిగించాలని స్థానికులు కలెక్టర్‌ను కలిసి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు కూడా చేశారు. సీఎం రాక సందర్భంగా అప్పటి వరకూ ఉన్న సుమారు వంద మెట్రిక్ టన్నుల చెత్తను శ్రీకాకుళంకు తరలించారు. ఇప్పుడు మళ్లీ చెత్త రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.


