శ్రీకాకుళం: నగరానికి చెందిన ప్రముఖ సీ్త్ర వైద్య నిపుణుడు డాక్టర్ దానేటి శ్రీధర్ గురువారం కేంద్ర మంత్రి శశిథరూర్ చేతుల మీదుగా జాతీయ స్థాయి అవార్డు అందుకున్నారు. ఇటీవల కేంద్ర మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ ద్వారా జాతీయస్థాయిలో పలు వర్గాల నుంచి 2047 నాటికి భారత దేశ అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై అభిప్రాయాలను సేకరించింది. ఇందులో డాక్టర్ శ్రీధర్ ఆరోగ్య సమాజ నిర్మాణానికి సంబంధించిన అంశాన్ని తీసుకొని గ్రామీణ స్థాయిలో ఉన్న సీ్త్రలను సైతం ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పించడం ద్వారా ఆరోగ్య సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.వెనుకబడిన శ్రీకాకుళం జిల్లాలో తొలిగా ఐవీఎఫ్ ప్రక్రియను ప్రారంభించానని, తక్కువ ఖర్చుతో ఈ సేవను అందిస్తూ వచ్చానని, సీ్త్రలలో ఎక్కువగా వచ్చే సర్వైకల్ క్యాన్సర్ నివారణకు ప్రభుత్వం వ్యాక్సిన్ ఇస్తుండగా దానిపై ఉన్న అపోహతో చాలామంది నిరాకరిస్తుండగా తాను సుమారు 150 మందికి ఉచితంగా వ్యాక్సిన్ వేసి నమ్మకం వచ్చేలా కృషి చేసినట్లు పేర్కొన్నారు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని అవార్డుకు ఎంపిక చేశారు.


