కవిటి: ఏపీ శాసనమండలి రెండో రోజు సమావేశాల నేపథ్యంలో.. వైఎస్సార్‌సీపీ చెందిన ఎమ్మెల్సీలు అర్హులైన నిరుద్యోగులకు డీఎస్సీలో జరిగిన అన్యాయంపై సమగ్ర న్యాయ విచారణ జరగాలని నిరసన కార్యక్రమం నిర్వహించారు. మంగళవారం వర్షాకాల సమావేశాల రెండో రోజు ఇదే అంశంపై ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
శాసనమండలి ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తూ నినాదాలు చేస్తూ సమావేశానికి హాజరయ్యారు. 2025 లో నిర్వహించింది మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఒక్కో టీచర్ పోస్టు రూ.20 లక్షలకు అమ్ముకోవడం సిగ్గుచేటు అంటూ ప్లకార్డులను ప్రదర్శిస్తూ శాసనమండలికి ర్యాలీగా వెళ్లారు. కార్యక్రమంలో నర్తు రామారావు, కుంభా రవిబాబు, పాలవలస విక్రాంత్‌తోపాటు సహచర సభ్యులు పాల్గొన్నారు.


