‘అభివృద్ధి చెందిన భారత్ దిశగా విద్యా ఉద్యమం’
శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): అభివృద్ధి చెందిన భారత్ దిశగా ధనిక్ భారత్ విద్యా ఉద్యమం జరుగుతోందని ధనిక్ భారత్ విద్యా సంస్థల డైరెక్టర్ బాలలత అన్నారు. ధనిక్ అనే భావన కేవలం ఆర్థిక సంపదకే పరిమితం కాకూడదని అన్నా రు. శ్రీకాకుళం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఆమె గురువారం విలేకరు ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సులువుగా ఐఏఎస్ ఎలా అవ్వాలనే దానిపై అవగాహన కల్పించారు. ఒత్తిడి లేని విద్య ద్వారానే అనుకున్న లక్ష్యాలు సాధించుకోవడం జరుగుతుందన్నారు. క్రమం తప్పకుండా కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థుల్లో మానసిక స్థైర్యం, జీవిత లక్ష్యం స్పష్టత పెంపొదించవచ్చన్నారు. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కేవలం చదువు మాత్రమే కాదని మేథస్సు నైతికత, భావోద్వేగ పరిపక్వత, జీవణ నైపుణ్యాల సమగ్ర వికాశమే ధనిక భారత్ లక్ష్యమన్నారు. సమావేశంలో ఆమెతో పాటు బోర్డు ఆఫ్ డైరెక్టర్స్ తదితరులు పాల్గొన్నారు.
పోలాకి: ‘నేను చనిపోతున్నాను .. ఇకపై నాతో మీకు ఏ ఇబ్బందులు ఉండవు’ అని తన కుటుంబానికి ఫోన్ చేసి ఇంటికి వెళ్లిపోయిన మహిళను పోలాకి పోలీసులు మొబైల్ ట్రాకింగ్ సిస్టం వినియోగించి సకాలంలో రక్షించారు. పోలాకి పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన మహిళ పైవిధంగా చెప్పి ఇంటిదగ్గర నుండి వెళ్లిపోయిందని 112కు కాల్ వచ్చింది. వెంటనే స్పందించిన ఎస్‌ఐ రంజిత్ సాంకేతిక సమాచారం ఆధారంగా ఆమె ఆముదాలవలస ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించి లోకల్ పోలీసులతో పాటు జీఆర్‌పీ సిబ్బందికి సమాచారం అందించారు. సిబ్బందితో పాటు అక్కడికి చేరుకుని ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆమె మానసికంగా ఇబ్బంది పడుతున్నట్లు గుర్తించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఒక నిండుప్రాణాన్ని కాపాడిన పోలాకి పోలీసులను ఎస్పీ మహేశ్వరరెడ్డి అభినందించారు.
మందస: మందస మండలం జిల్లుండ పంచాయితీ డిమిరియా గ్రామంలో ప్రభుత్వం ఆమోదించిన ఇంటింటి పైపులైన్లను కొందరు అధికార వర్గ ‘పెద్ద లు’ అడ్డుకున్నారు. తమ స్థలంలో పైప్‌లైన్ వేయవద్దని పనులు ఆపేశారు. ఎస్సీ వీధుల్లోని ప్రభుత్వ స్థలంలో పైపులైన్లు వెళ్తుండగా ఇది తమ జాగా అంటూ బెదిరించి పనులు ఆపివేయించారు. వైస్ ఎంపీపీ సీర ప్రసాద్ దీన్ని ఖండించినా, ప్రభుత్వం తమదని, తమ ఇష్టమని విమర్శించారు. దీనిపై గ్రామ స్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవదాయ భూములను కూడా ఆక్రమించారని ఆరోపిస్తున్నారు. అధికారులు పరిశీలించి సమస్య పరిష్కరించాలని కోరుతున్నారు.
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో భీష్మ ఏకాదశి పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ మేరకు గురువారం ఆలయంలో స్వామికి ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక అర్చనలు చేశారు. అలాగే అనివెట్టి మండపంలో శ్రీ ఉషా పద్మిని ఛాయాదేవేరులతో శ్రీ సూర్యనారాయణ స్వామి వారి కల్యాణమూర్తులకు ఆగమశాస్త్రం ప్రకారం ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సాందీప్ శర్మ కల్యాణం జరిపించారు.
‘అభివృద్ధి చెందిన భారత్ దిశగా విద్యా ఉద్యమం’


