అపవిత్ర రాజకీయంపై ఆధ్యాత్మిక విజయం
పాతపట్నం: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన ఆరోపణలు కేవలం రాజకీయ కుట్రలేనని తేలిపోయిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ సభ్యురాలు, పాతపట్నం మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. సీబీఐ దర్యాప్తులో నెయ్యిలో జంతువు ల కొవ్వు కలవలేదని తేలడంతో, సత్యం గెలిచినందుకు కృతజ్ఞతగా గురువారం స్థానిక శ్రీ నీలమణిదుర్గ ఆలయంలో పార్టీ నాయకులతో కలిసి రెడ్డి శాంతి అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు 108 కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ హయాంలో వాడిన నెయ్యిలో ఎలాంటి అపవిత్రత లేదని శాసీ్త్రయంగా తేలిపోయిందన్నారు. తన పాలనలోని వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు ఈ లడ్డూ డ్రామా ఆడారని, దానికి పవన్ కల్యాణ్ వత్తాసు పలకడం దురదృష్టకరమని విమర్శించా రు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పీఏసీఎస్ మాజీ అధ్యక్షుడు ఉర్లాన బాలరాజు, పార్టీ అధ్యక్షుడు సవిరిగాన ప్రదీప్, మీసాల వెంకట రామకృష్ణ, పెనుమజ్జి విష్ణుమూర్తి, పోలాకి జయమునిరావు, గండివలస ఆనందరావులు, మాజీ ఎంపీపీ బాలరాజు, నాయకులు రెడ్డి రామారావు, ఎరుకొల వెంకటరమణ, మడ్డు తాతయ్య, ఏవీ సురేష్ తదితరులు పాల్గొన్నారు.


