రేపు జాబ్‌మేళా నిర్వహణ
శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయం ఆధ్వర్యంలో నెహ్రూ యువకేంద్రం వేదికగా ఈనెల 31వ తేదీన జాబ్‌మేళా నిర్వహిస్తు న్నట్టు జిల్లా ఉపాధి అధికారి కొత్తలంక సుధ తెలి పారు. జాబ్‌మేళాలో ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ కంపెనీ, జయభేరి ఆటోమోటివ్ సంస్థలో వివిధ ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నా రు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన సీ్త్ర, పురుషులు అర్హులన్నారు. కనీసం టెన్త్‌క్లాస్ ఉత్తీర్ణులై ఉండాలని స్పష్టం చేస్తున్నారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగ అభ్యర్థులు శనివారం ఉదయం 10 గంటలకు తమ బయోడేటా, ఆధార్‌కార్డు, సర్టిఫికెట్లు తీసుకురావాలని సుధ సూచించారు.
అరసవల్లి: అరసవల్లి సూర్యనారాయణ స్వామిని రాష్ట్ర దేవదాయ శాఖ మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ గిరిజాశంకర్ గురువారం ఉదయం దర్శించుకున్నారు. ఈయనకు ఆలయ సంప్రదాయం ప్రకారం ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ గౌరవ స్వాగతం పలికి అంతరాలయ దర్శనం చేయించారు. అనంతరం ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకరశర్మ ఆధ్వర్యంలో ప్రత్యేక అర్చనలు చేయించారు.
శ్రీకాకుళం పాతబస్టాండ్: చిన్న, మధ్య తరగతి పరిశ్రమల అభివృద్ధికి క్రమశిక్షణ అవసరమని, ఎన్‌ఆర్‌డీసీ వర్క్‌షాపులో పాల్గొన్న వక్తలు తెలిపారు. జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్థ(ఎన్‌ఆర్‌డీసీ), ఆంధ్రప్రదేశ్ ఎంఎస్‌ఎంఈ అభివృద్ధి సంస్థలు సంయుక్తంగా జిల్లా కేంద్రంలోని జిల్లా మహిళా సమాఖ్య భవన సమావేశ మందిరంలో గురువారం వర్క్‌షాప్ నిర్వహించారు. ‘మేధో సంపత్తి హక్కులు–సాంకేతిక బదిలీ–వాణిజ్యీకరణ’ అనే అంశంపై వ ర్క్‌షాప్‌లో మాట్లాడారు. ఎన్‌ఆర్‌డీసీ డిప్యూటీ మేనేజర్ ప్రీతి నిహారిక, ఎన్‌ఆర్‌డీసీ విశాఖపట్నం డీఎం హెడ్ డాక్టర్ భవ్య మంజీరలు ప్రసంగించారు.


