కృషి విజ్ఞాన కేంద్రానికి రాష్ట్రస్థాయి అవార్డు
ఆమదాలవలస: ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రానికి రాష్ట్ర స్థాయి అవార్డు వచ్చినట్లు కేవీకే ప్రొగ్రాం కో ఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి గురువారం తెలిపారు. ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2024–25 సంవత్సరానికి కృషి విజ్ఞాన కేంద్రం ఆమదాలవలస వారు చేసిన విస్తరణ సేవలకు గాను రాష్ట్ర స్థాయిలో ఉత్తమ కృషి విజ్ఞాన కేంద్రం అవార్డుకు ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. గుంటూరు లామ్‌లో జరిగిన పరిశోధన, విస్తరణ సలహా మండలి సమావేశంలో ఉపకులపతి, డాక్టర్ ఆర్.శారదా జయలక్ష్మీదేవి చేతులమీదుగా ఈ అవార్డును ఆమదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రొగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ కె.భాగ్యలక్ష్మి అందజేశారు.


