కిడ్నీ వ్యాధితో హెచ్‌ఎం మృతి
ఇచ్ఛాపురం రూరల్: మండలంలోని ఈదుపురం.ఆర్ ప్రాథమిక పాఠశాలలో ఎల్‌ఎఫ్‌ఎల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న మార్కెండేయ బిసాయి(59) మంగళవారం మృతి చెందారు. కవిటి మండలంలోని కుసుంపురం గ్రామానికి చెందిన ఆయన గత కొన్ని రోజుల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ సోంపేటలో డయాలసిస్ చేయించుకుంటున్నారు. మంగళవారం రాత్రి భోజనం చేస్తుండగా అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే వాహనంలో సోంపేట ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందారు. ఈయనకు భార్య అనసూయ, కుమారుడు నవీన్ బిసాయి, కుమార్తె మనీషలు ఉన్నారు. మృతికి ఎంఈవోలు కురమాన అప్పారావు, ఎస్.విశ్వనాథంలు, ఉపాధ్యాయ సంఘాలు సంతాపం తెలిపాయి. బొంతొరియా సంఘ నాయకుడిగా, ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా మార్కండేయ బిసాయి సేవలు అందించారని పలువురు గుర్తు చేసుకున్నారు.


