అపురూపం.. అరటి గెలల ఉత్సవం..!
టెక్కలి:
భీష్మ ఏకాదశి పర్వదినం పురస్కరించుకొని సంతబొమ్మాళి మండలం చెట్లతాండ్ర గ్రామంలో రెండు రోజుల పాటు ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుంది. ఆ గ్రామంలో ప్రతిఏటా భీష్మ ఏకాదశి రోజున పెద్ద ఎత్తున అరటి గెలల ఉత్సవం జరుగుతుంది. గురువారం భీష్మ ఏకాదశి సందర్భంగా గ్రామంలోని లక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కోర్కెలు తీరుతాయని..
భీష్మ ఏకాదశి రోజున ఆలయ ప్రాంగణంలో పరవస్తు అయ్యవారికి అరటి గెలలను సమర్పిస్తే కోరిన కోర్కెలు తీరుతాయనే నమ్మకం అక్కడి ప్రజలది. దీంతో ప్రతిఏటా అరటి గెలల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది అరటి గెలల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో గ్రామంలో ఉత్సవ కమిటీ సభ్యులంతా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గురువారం ఆలయంలో పూజా కార్యక్రమాలతో పాటు భజనా కాలక్షేపం, అన్నదానం నిర్వహించనున్నారు. వీటితో పాటు మొదటి రోజు చింతామణి నాటకం, రెండో రోజు మెగా డ్యాన్స్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఇదీ చరిత్ర..
చెట్లతాండ్ర గ్రామంలో అరటి గెలలు మొక్కులుగా చెల్లించుకునే సాంప్రదాయం వెనుక ఎంతో చరిత్ర ఉంది. 172 ఏళ్ల క్రితం ప్రస్తుతం నౌపడ ఆర్‌ఎస్.. అప్పట్లో రాళ్లపేట రైల్వేస్టేషన్‌లో చెట్లతాండ్ర గ్రామానికి చెందిన కుమ్మర్లు కుండలు అమ్మడానికి వెళ్లగా, వారి వద్దకు పరవస్తు అయ్యవారు వచ్చి తనను చెట్లతాండ్ర గ్రామానికి తీసుకెళ్లాలని చెప్పారు. దీంతో ఆయా కుమ్మర్లు అయ్యవారిని గ్రామానికి తీసుకొచ్చారు. గ్రామంలో అప్పట్లో ఉన్న పాఠశాల వద్ద గ్రామానికి చెందిన పంగ అప్పలనాయుడుకు చెందిన స్థలంలో పర్ణశాల ఏర్పాటు చేసి అయ్యవారికి ఆతిథ్యం ఇచ్చారు. ఆయన నిత్యం లక్ష్మీ నృసింహస్వామిని ఆరాధిస్తూ గ్రామంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించేవారు. గ్రామంతో పాటు ఇతర ప్రాంతాల్లోనూ సత్సంగ కార్యక్రమాలు చేపట్టేవారు. గ్రామంలో ఏదైనా కుటుంబంలో సమస్యలు తలెత్తినప్పుడు అయ్యవారికి తెలియజేసి నరసింహస్వామికి మొక్కుకునేవారు. దీంతో ఆ సమస్యలు తొలగిపోవడమే కాకుండా కోరిన కోర్కెలు నెరవేరుతుండేవి. అయ్యవారి వద్ద ఉన్నటువంటి అక్షయపాత్ర నుంచి ప్రతిరోజూ స్వామివారికి నైవేద్యం సమర్పిస్తూ భక్తులకు ప్రసాదాలుగా అందజేసేవారు. అయితే ఏ రోజూ వంటకాలు చేసిన దాఖలాలు లేవు. కేవలం అక్షయపాత్ర నుంచి వచ్చే ప్రసాదాన్ని మాత్రమే నైవేద్యంగా సమర్పించేవారు. ఇలా
నేటి నుంచి చెట్లతాండ్రలో
భీష్మ ఏకాదశి ఉత్సవాలు
అరటి గెలల నైవేద్యానికి అంతా సిద్ధం
తరలి రానున్న వేలాదిమంది భక్తులు


