తొలితరం కమ్యూనిస్టు మృతి
పలాస: మండలంలోని బొడ్డపాడు గ్రామానికి చెందిన తొలితరం కమ్యూనిస్టు నాయకుడు, బొడ్డపాడు అన్నదాత రైతు సంఘం వ్యవస్థాపకుల్లో ఒకరైన రాజాం గుణవంతు (76) బుధవారం మృతి చెందాడు. అతను అప్పటి శ్రీకాకుళం పోరా టంలో పాల్గొని కొంతకాలం అజ్ఞాత జీవితం, మరికొంతకాలం జైలు జీవితం కూడా అనుభవించాడు. నిరంతరం ప్రజల కోసం, బొడ్డపా డు గ్రామ అభివృద్ధి కోసం పరితపించిన వ్యక్తి మృతిపై గ్రామస్తులు దిగ్బ్రాంతి చెందారు. అతనికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. గ్రామంలో గురువారం అంతిమ యాత్ర జరగనుందని గ్రామస్తులు తెలిపారు.
అనుమతులను సద్వినియోగం చేసుకోండి
టెక్కలి: ఏపీ ఎండీసీ ఆధ్వర్యంలో ఇవ్వనున్న గ్రానైట్ క్వారీ లీజు అనుమతులను ఆసక్తి కలిగిన యజమానులు సద్వినియోగం చేసుకోవాలని టెక్కలి మైన్స్ ఏడీ విజయలక్ష్మి కోరారు. ఈ మేరకు ఏపీ ఎండీసీ ఆధ్వర్యంలో క్వారీ లీజు అనుమతులపై బుధవారం టెక్కలిలో గ్రానైట్ క్వారీ యజమానులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎండీసీ ఆధ్వర్యంలో క్వారీ లీజులను ఏ విధంగా పొందాలి అనే విషయా న్ని వివరించారు. కార్యక్రమంలో మైన్స్ డీడీ కార్యాలయం ఏజీ ఆర్.కుమార్‌నాయుడు, ఏపీ ఎండీసీ సహాయ ప్రాజెక్టు అధికారి దీన్ పాల్, స్థానిక మైన్స్ కార్యాలయం ఏజీ రాము, ఆర్‌ఐ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
అన్యాయంగా చెక్కు పవర్ రద్దు చేశారు
ఎచ్చెర్ల: మండలంలోని బొంతలకోడూరు గ్రామ సర్పంచ్ చెక్కు పవర్‌ను కూటమి నాయకులు అన్యాయంగా రద్దు చేయించారని సర్పంచ్ పంచిరెడ్డి రాంబాబు, ఎంపీటీసీ మాడుగుల జగదీష్‌లు ఆరోపించారు. ఈ మేరకు గ్రామంలో బుధవారం నిరసన తెలిపారు. సర్పంచ్ రాంబాబు మాట్లాడుతూ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు గానీ, సాధారణ నిధులు గానీ దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. కానీ 10 నెలలుగా ఇప్పటివరకూ చెక్కు పవర్ పునరుద్ధరణ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలతో ఎన్నికై న ప్రజాప్రతినిధుల అధికారాలను కలెక్టర్, డీపీవోలు ఏ అధికారంతో తీసుకున్నారో తెలియజేయాలని ప్రశ్నించారు. రాష్ట్ర హైకోర్టు కూడా నవంబర్ 20వ తేదీన చెక్కు పవర్‌ను పునరుద్ధరించాలని ఆదేశాలు ఇచ్చిందని గుర్తు చేశారు. హైకోర్టు ఆదేశాలిచ్చి 4 నెలలు కావస్తున్నా జిల్లా పంచాయతీరాజ్ అధికారులు కూటమి నాయకుల కనుసన్నల్లో పనిచేస్తూ కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పంచాయతీరాజ్ అధికారులు దర్యాప్తు చేయాలని, అవినీతి జరిగితే ఈ పదవులు విడిచిపెడతామని స్పష్టం చేశారు. చెక్కు పవర్‌ను వెంటనే పునరుద్ధరణ చేయాలని, లేదంటే పోరా టాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తొలితరం కమ్యూనిస్టు మృతి
తొలితరం కమ్యూనిస్టు మృతి


