దర్జాగా కబ్జా..! | - | Sakshi
Sakshi News home page

దర్జాగా కబ్జా..!

Jan 29 2026 6:33 AM | Updated on Jan 29 2026 6:33 AM

దర్జాగా కబ్జా..!

దర్జాగా కబ్జా..!

ప్రభుత్వ భూములపై అక్రమార్కుల కన్ను

పలాసలో రూ.కోట్లు విలువైన భూములు స్వాహా

పట్టించుకోని అధికారులు

వజ్రపుకొత్తూరు రూరల్‌: అంతర్జాతీయ స్థాయిలో తెల్ల బంగారం(జీడిపప్పు)కు ప్రసిద్ధి గాంచిన పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీలో అక్రమార్కులు బరితెగిస్తున్నారు. కళ్లకు కనిపించిన ప్రభుత్వ భూములను కబ్జా చేసేందుకు పోటీ పడుతున్నారు. అందిన మేరకు ప్రభుత్వ భూమిని కాజేసి అమ్మకాలు చేపడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. ఈ ప్రాంతంలో వ్యాపార, వాణిజ్య కేంద్రాలతో పాటు జాతీయ రహదారి, రైల్వే రవాణా సౌకర్యం ఉండడం, అలాగే సముద్ర తీరం కూడా సుమారు 10 కి.మీ దూరంలో ఉండడంతో ఇక్కడ ఉన్న భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాగే ఇటీవల పలాస జిల్లాగా మారుతుందని జోరుగా ప్రచారం జరగడంతో ఎక్కువ మంది ప్రజలు ఈ ప్రాంతంలో ఇంటి స్థలాలను కొనేందుకు ఆసక్తి చూపారు. దీంతో ఇంటి స్థలాల రేట్లు కూడా భారీగా పెరిగాయని క్రయ విక్రయదారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే అవకాశాన్ని కొంతమంది అక్రమార్కులు అదునుగా చేసుకొని ప్రభుత్వ భూములపై కన్నేశారు. విలువైన ప్రభుత్వ భూములు, చెరువులు, కాలువలను ఆక్రమించి ఇంటి స్థలాలుగా అమ్మకాలు చేపడుతూ దోచుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన అధికారులు మాత్రం తమకేమీపట్టనట్లుగా మొద్దునిద్ర నటిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదీ పరిస్థితి..

పలాస – కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ కబ్జాలు పెరిగాయి. అదే పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు అప్పట్లో అధికారాన్ని అడ్డం పెట్టుకొని పలాస–కాశీబుగ్గ పరిధిలో ఉన్న సూదికొండ, పెంటిభద్ర, పురుషోత్తపురం, పద్మనాభపురం మార్కెట్‌ యార్డు వెనుకన ఉన్న ప్రభుత్వ భూమి, కాలువను సైతం ఆక్రమించుకున్నారు. ఆయా ప్రాంతాల్లో విలువైన ప్రభుత్వ భూములను యథేచ్ఛగా కబ్జా చేసి, గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు చేపట్టారు. అలాగే ఒకే ఇంటి స్థలాన్ని ఇద్దరు, ముగ్గురు వ్యక్తులకు అమ్మకాలు చేసి భూ వివాదాలు సైతం సృష్టించారు. దగ్గరుండి భూ వివాదాలు సైతం పరిష్కరించి రూ.లక్షల్లో దండుకున్నట్లు తెలుస్తోంది. సూదికొండకు ఆనుకొని ఉన్న పలాస, పురుషోత్తపురం పరిధి సర్వే నంబర్‌ 51లో 60.20 ఎకరాల భూ విస్తీర్ణం ఉంది. ఈ మొత్తం విస్తీర్ణంలో ప్రభుత్వాలు దశలు వారీగా పేదలకు ఇళ్ల పట్టాలను మంజూరు చేశాయి. కొంతభాగం కొండ ప్రాంతం ఉంది. కాగా సుమారు రూ.20 కోట్లు విలువైన మిగిలిన ప్రభుత్వ భూమిని ప్రస్తుతం కొంతమంది అధికార కూటమి పార్టీల నాయకులు ఆక్రమించుకొని, పక్కనే ఉన్న పద్మనాభపురం రెవెన్యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement