
వక్ఫ్ సవరణ చట్టం ఉపసంహరించుకోవాలి
శ్రీకాకుళం పాతబస్టాండ్: వక్ఫ్ సవరణ చట్టం– 2025కు వ్యతిరేకంగా గురువారం జిల్లా ముస్లింల ఐక్య సమాఖ్య జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నగరంలో నిరసన ర్యాలీ చేపట్టారు. ముందుగా కాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన అమాయక ప్రజలకు నివాళులు అర్పించారు. ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం ఏడు రోడ్ల కూడలిలో బయలు దేరి కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.వెంకటే శ్వరరావుకు జిల్లా ముస్లిం ఐక్య సమాఖ్య జేఏసీ నాయకులు శ్రీనివాసరావు, సలీం, హాజీ అమీరుల్లా బేగ్, రఫీ, మహీబుల్లా ఖాన్, ముజీబ్, అక్బర్‌బా షా, మహిళా సోదరీమణులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్త చట్టం ముస్లింల హక్కులను కాలరాస్తుందన్నా రు. భవిష్యత్తులో ముస్లింల మనుగడకే ఇబ్బందిగా మారే చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, ముస్లింల ర్యాలీకి అన్ని రాజకీయా పక్షాల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, క్రైస్తవ సంఘాల ప్రతినిధులు, కుల సంఘాల ప్రతినిధులు, సీఐటీయూసీ, ఏఐటీయూసీ నాయకులు సంఘీబావం తెలిపారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.