చేను మేసింది
ట్రెంచే
బైరిలోనూ అదే పరిస్థితి
బైరిలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలకు విరుద్ధంగా నదిలోకి నేరుగా రోడ్డు వేసేశారు. అనుమతి ఉన్న ర్యాంపుగా చెప్పుకుని అడ్డగోలు కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. నదీ గమనాన్ని మార్చేసేలా రోడ్డు వేయడమే కాకుండా నదిలో ప్రవహిస్తున్న నీటిని మళ్లించేలా పైపులతో చిన్న పాటి వంతెనను కూడా నిర్మించేశారు. అంతటితో ఆగకుండా పరిమితికి మించి, లోతైన గోతులు తవ్వి, ఇసుకను తోడేస్తున్నారు. అక్రమార్కులు విధ్వంసానికి నది స్వరూపమే మారిపోయి, ప్రమాదకరంగా తయారైంది.


