సరుకు ఫుల్‌.. వ్యాపారం డల్‌! | - | Sakshi
Sakshi News home page

సరుకు ఫుల్‌.. వ్యాపారం డల్‌!

Jan 15 2026 8:31 AM | Updated on Jan 15 2026 8:31 AM

సరుకు

సరుకు ఫుల్‌.. వ్యాపారం డల్‌!

విక్రయాలు అంతంతే..

పండగ సమయంలో ఇక్కడ వ్యాపారాలు అధికంగా జరుగుతాయని ఎంతో దూరం నుంచి వచ్చాం. కానీ ఆశించినంత స్థాయిలో జరగలేదు. మేము పదేళ్లుగా ఇక్కడికి వస్తున్నాం. గతంలో ఎప్పుడూ ఇంత తక్కువగా వ్యాపారం జరగలేదు. ట్రాన్స్‌పోర్టుకు డబ్బులు రావడం లేదు. ఇక్కడ ఫుట్‌పాత్‌కు కూడా అద్దె చెల్లిస్తున్నాం.

– మహ్మద్‌ అక్బర్‌,

ఫుట్‌పాత్‌ వ్యాపారి, నాగ్‌పూర్‌

శ్రీకాకుళం కల్చరల్‌: ప్రతి సంక్రాంతి సీజన్‌లాగే ఈ ఏడాది కూడా జిల్లా కేంద్రంతో పాటు నరసన్నపేట, పలాస, టెక్కలి తదితర పట్టణాలకు ఉత్తరాది నుంచి భారీగా వ్యాపారులు తరలివచ్చారు. సరికొత్త వైరెటీలతో భారీ ఎత్తున సరుకుతో వచ్చినా ఈ ఏడాది వ్యాపారం అంతంతమాత్రంగానే జరిగిందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అత్యధిక పెట్టుబడితో అధిక సరుకులతో ప్రతి ఏడాదిలాగే ఎక్కువగా వ్యాపారం జరుగుతుందనే ఆశతో అడుగుపెట్టినా ఈసారి నిరాశే ఎదురైందని వాపోతున్నారు. పదేళ్లలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి వ్యాపారం బాగా తగ్గిపోయిందని ఆవేదన చెందుతున్నారు. కారణం ఏంటో అంతుపట్టక తలలు పట్టుకుంటున్నారు.

ఫుట్‌పాత్‌పైనే వ్యాపారాలు..

దుస్తులు, గాజులు, చెప్పులు, గృహోపకరణాలు, ఇతర వస్తువులు అమ్మేందుకు ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, ఆగ్రా, నాగపూర్‌, కోల్‌కతా తదితర ప్రాంతాల నుంచి సుమారు వెయ్యి మంది వ్యాపారులు, సిబ్బంది తమ సరుకుతో ఏటా సిక్కోలు జిల్లా కేంద్రానికి వస్తుంటారు. వీరంతా నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌లపై ఉత్పత్తులను విక్రయిస్తుంటారు. సంక్రాంతి అనంతరం సొంత రాష్ట్రాలకు వెళ్లిపోతుంటారు. ఈ ఏడాది కూడా అదే తరహాలో చాలామంది తమ సరుకులతో జిల్లా కేంద్రానికి విచ్చేశారు.

10 శాతమే అమ్మకాలు..

ఏటా ఈ సమయానికి పూర్తిస్థాయిలో తమ వద్ద ఉన్న సరుకులను విక్రయించి ఇంటి బాట పట్టేందుకు సమయత్తమవుతారు ఉత్తరాది వ్యాపారులు. ఈ ఏడాది తీసుకొచ్చిన సరుకుల్లో కనీసం 10 శాతం కూడా అమ్ముడుపోలేదని, దారి ఖర్చులు, ట్రాన్‌పోర్ట్‌ ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి లేదని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనవరి ఒకటి నుంచి ప్రారంభమైన వ్యాపారాలు ఇప్పటివరకు వృద్ధి లేదని చెబుతున్నారు.

గడ్డికుప్పలు దగ్ధం

టెక్కలి రూరల్‌: పరశురాంపురంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో గడ్డి కుప్పలు దగ్ధమయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్పంచ్‌ కోరాడ కామేష్‌తో పాటు మరికొందరు సుమారు 5ఎకరాల గడ్డిని కుప్పలుగా పెట్టి ఉంచారు. బుధవారం మధ్యాహ్నం సమీప పొలంలోని వరి దుబ్బులు కాల్చేందుకు పెట్టిన మంట చెలరేగి పక్కనే ఉన్న గడ్డికుప్పలపై పడటంతో ఈ ప్రమాదం సంభవించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అప్పటికే చాలావరకు కుప్పలు కాలిపోయాయి.

నిరాశే..

ఎంతో దూరంనుంచి వ్యాపారం కోసం వచ్చాం. అమ్మకాలు అంతంతమాత్రమే జరిగాయి. ట్రాన్స్‌పోర్టు ఖర్చుకు కూడా డబ్బులు వస్తాయో లేదో తెలియదు. బండిమీదే పెట్టి సరుకు అమ్ముతున్నాం.

– సోహిల్‌, వ్యాపారి, ఉత్తరప్రదేశ్‌

వ్యాపారం తగ్గింది..

గత 15 ఏళ్లుగా టీకప్పులు వ్యాపారం చేస్తున్నాం. ఈ ఏడాది చాలా తక్కువగా వ్యాపారం జరిగింది. తోపుడు బండి అద్దెకు తీసుకొని గత పది రోజులుగా వ్యాపారం చేస్తున్నాం.

– షఫీద్‌, ఫుట్‌పాత్‌ వ్యాపారి, ఆగ్రా

సరుకు ఫుల్‌.. వ్యాపారం డల్‌!1
1/4

సరుకు ఫుల్‌.. వ్యాపారం డల్‌!

సరుకు ఫుల్‌.. వ్యాపారం డల్‌!2
2/4

సరుకు ఫుల్‌.. వ్యాపారం డల్‌!

సరుకు ఫుల్‌.. వ్యాపారం డల్‌!3
3/4

సరుకు ఫుల్‌.. వ్యాపారం డల్‌!

సరుకు ఫుల్‌.. వ్యాపారం డల్‌!4
4/4

సరుకు ఫుల్‌.. వ్యాపారం డల్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement