ఆచారాలు కొనసాగిస్తున్నాం
మా పూర్వీకుల నుంచి గుండవల్లిపేటలోనే నివసిస్తున్నాం. చాలా ఏళ్లుగా పూర్వీకులు చూపిన బాటలోనే నడుస్తున్నాం. ఈ ప్రాంతంలో మాలాంటి వేషధారణ ఇంకెవరూ వేయరు. సొంతంగా మాకు భూములు లేవు. ఈ వేషధారణతో పాటు కూలి పనులకు వెళ్తుంటాం. – ఆవల జగన్నాథం
పెద్దలు చూపిన ఆచారం
మేము కవల పిల్లలం. పెద్దలు చూపిన మార్గంలోనే నడుస్తూ ఆచారాలను కొనసాగిస్తున్నాం. ప్రజల నుంచి ఆదరణ బాగుంది. మా పాటలు, ఆటలకు చూపరులు ఆనందిస్తున్నారు. మా దీవెనలు ప్రత్యేకంగా పొందుతున్నారు. కొండ దేవతను తలుచుకొని స్థానికులను దీవిస్తుంటాం.
– ఆవల రామ, లక్ష్మణులు(కవలలు)


