వారికి సేవాక్రాంతి
● అందరికీ సంక్రాంతి
● వృద్ధులకు, అనాథలకు వస్త్రదానం
● అనాథ శరణాలయాలకు నిత్యావసర
సరుకులు
● సంస్థల పేరుతో కొందరు..
వ్యక్తిగతంగా మరికొందరు..
పండగ అంటే ఆనందం.. శుభసూచకం. కొత్త బట్టలు.. పిండి వంటలు.. ఆచారాలు.. సంప్రదాయాలు.. ఇదీ క్లుప్తంగా సంక్రాంతి పర్వదినమంటే.. కానీ కొంతమంది దృష్టిలో పండగకు అర్థం వేరు. అన్నార్థులు.. అభాగ్యులు.. అవసరార్థులు.. కూడు, గుడ్డకు అష్టకష్టాలు పడే వారికి ఆసరాగా నిలవడం.. అభాగ్యుల కళ్లల్లో సంక్రాంతులు నింపడమే పండగంటారు ఈ దాతలు. పండగ వచ్చిందంటే చాలు కార్లలో నిత్యావసరాలు, వస్త్రాలు, దుప్పట్లు పట్టుకుని వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు చేరి తోటిమనిషికి సాయపడాలనే కోరిక తీర్చుకుంటారు. సంక్రాంతి వేళ ఆ దాతృత్వ భావన ఉండే వారిని ఓసారి పలకరిస్తే.. వారి సేవాభావానికి అక్షరరూపం ఇస్తే ఇదే ఆ కథనం.. –శ్రీకాకుళం కల్చరల్


